NTV Telugu Site icon

Love Fraud: నన్ను మోసం చేశాడు.. నడిరోడ్డుపై ప్రియురాలు రచ్చ మామూలుగా చేయలేదండోయ్‌

Love Froud

Love Froud

Love Fraud: ప్రేమలో మోసపోయినప్పుడు వ్యక్తులు ఏం చేస్తారు? చాలా మంది తమ ప్రాణాలను వదులుకోవడమే మంచిదని భావిస్తుంటారు. మరోవైపు చాలా మంది డ్రగ్స్‌కు గురవుతున్నారు. మరికొంతమంది ప్రేమికులు కూడా ప్రేమలో మోసపోయిన తర్వాత, మోసం చేసిన వ్యక్తిపై తీవ్రంగా గొడవలు సృష్టించి, వారిని విడిచిపెట్ట కుండా వేధింపులకు గురిచేస్తూ ప్రతీకార మార్గంలో నడుస్తారు. ఇక సున్నిత మనస్కులైతే మనసు బాధను తట్టుకోలేక నడిరోడ్డుపై నానా హంగామా చేస్తారు. ఇటీవల సోషల్ మీడియాలో అలాంటి వీడియో ఒకటి వైరల్‌ అవుతుంది. ఈ వీడియోలో ఓ యువతి 25 ఏళ్ల యువతి నడిరోడ్డుపై దుర్భాషలాడుతూ గంటల తరబడి రచ్చ మామూలుగా చేయలేదు. ఈఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ – ఫూల్ బాగ్ లో చోటుచేసుకుంది.

ఫూల్‌ బాగ్‌లో ఓయువతి రోడ్డుపై ఉన్న వ్యక్తులను దుర్భాషలాడడం , వాహనాలను ఆపి వారిపైకి ఎక్కి నానాహంగామా సృష్టించింది. అంతేకాకుండా.. ఆ అమ్మాయి ఓ వృద్ధుడి స్కూటీని లాక్కొని స్వయంగా నడపడం ప్రారంభించింది. ఈ సమయంలో ప్రజలు కూడా ఆమెను ఆపడానికి ప్రయత్నించిన ఆమె అస్సలు వినలేదు. దీని తర్వాత ఆమె రోడ్డుపై ఉంచిన బారికేడ్లను కూడా విసరడం ప్రారంభించింది. అనంతరం ఆమె పిచ్చిగా కేకలు వేస్తూ కదులుతున్న కారు బానెట్ మీద కూర్చని, నిలబడి చేతిలో కత్తి పట్టుకుని నా లవర్‌ నన్ను మోసం చేశాడంటే గట్టి గట్టిగా కేకలు వేస్తుండటంతో కారు డ్రైవర్ తన కారును పక్కన పెట్టాడు. అక్కడే వున్న కొంతమంది వ్యక్తులు ఆమెను కారు నుండి దిగమని బతిమలాడినా కాని అమ్మాయి అంగీకరించకపోగా.. ఆమె దిగి కారు డ్రైవర్‌పై అరుస్తూ తన తగ్గర వున్న కత్తితో అతన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. దీంతో స్థానికులు అమెను పట్టుకుని, ఒప్పించి ఆమెను పోలీసులకు అప్పగించారు.

ఈ వీడియో వైరల్ కావడంతో ప్రజలు కామెంట్ చేస్తున్నారు. లేడీ మత్తులో ఉందా? అని అడుగుతున్నారు. మరోవైపు ఆ యువతి మానసిక పరిస్థితిపై కొందరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్‌ చేసింది. సోషల్ మీడియాలోని ప్రతి ప్లాట్‌ఫారమ్‌లో ప్రజలు దీనిని చూసేందుకు ఆశక్తి చూపుతున్నారు. మరి కొందరు ట్రూలవ్‌ ని ఎవరు నమ్మరు, మనసు విరిగితే ఇలానే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.

యువతి నడిరోడ్డుపై హల్ చల్:

Show comments