Woman Attacks On Boss Mother Over Husband Night Shift Issue: ఉత్తరాఖండ్‌లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. తన భర్తకు ప్రతిరోజూ నైట్ షిఫ్ట్ వేస్తున్నాడనే కోపంతో.. భర్త మేనేజర్ తల్లిపై అతని భార్య ఎటాక్ చేసింది. అయితే.. సీసీటీవీ ఫుటేజీల కారణంగా ఆమె అడ్డంగా బుక్కైంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఉధమ్‌సింగ్ నగర్ జిల్లా ట్రాన్సిట్ క్యాంపు ప్రాంతంలోని హౌసింగ్ డెవలప్‌మెంట్‌లో రమణ్‌దీప్, రవ్లీన్ కౌర్ అనే దంపతులు నివసిస్తున్నారు. పంత్‌నగర్‌లో ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీలో రమణ్‌దీప్ ఎగ్జిక్యూటివ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో దీపక్ భాటియా అనే వ్యక్తి హెచ్‌ఆర్ హెడ్ పదవిలో ఉన్నాడు. రమణ్‌దీప్, దీపక్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఆ స్నేహంతోనే దీపక్ తన కంపెనీలో రమణ్‌దీప్‌కి ఉద్యోగం ఇప్పించాడు.
Mrunal Thakur: మృణాల్‌తో పెట్టుకుంటే బొక్కల్ ఇరుగుతయ్ బిడ్డ.. జర జాగ్రత్త!
అయితే.. ఆ ఇద్దరి మధ్య ఏం చెడిందో ఏమో తెలీదు కానీ, కొంతకాలం నుంచి రమణ్‌దీప్‌కు దీపక్ కావాలనే నైట్ షిఫ్ట్ వేస్తున్నాడు. తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పినా దీపక్ వినిపించుకోకుండా.. రోజూ నైట్ షిఫ్ట్ రావాల్సిందేనని తేల్చి చెప్పాడు. దీంతో రమణ్‌దీప్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే రవ్లీన్ కౌర్ తన భర్త యజమాని అయిన దీపక్‌పై కోపం పెంచుకుంది. అతనికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని, ఒక ప్లాన్ వేసింది. ప్లాన్ ప్రకారం.. ఒక రోజు రాత్రి రవ్లీన్ కౌర్ మాస్క్ ధరించి, దీపక్ ఇంట్లోకి ప్రవేశించింది. ఇంట్లో ఉన్న దీపక్ తల్లిపై సుత్తితో దాడి చేసింది. ఆ దెబ్బకు ముసలావిడ గట్టిగా అవరడంతో.. ఆమె మనవడు బెడ్‌రూంలోకి వచ్చాడు. అతడు రాగానే.. రవ్లీన్ కౌర్ భయపడి, అక్కడి నుంచి పారిపోయింది. గాయపడిన ఆ ముసలావిడను ఆసుపత్రికి తరలించారు.
Capsicum Price: టమాటా కంటే క్యాప్సికమ్కు ధర ఎక్కువ..! ఎక్కడంటే
ఈ ఘటనపై దీపక్ భాటియా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాళ్లు కేసు నమోదు చేసి, వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. తమ దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను గమనించారు. అందులో రవ్లీన్ కౌర్ కనిపించడంతో.. ఆమెని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ దాడి ఎందుకు చేశావని ప్రశ్నిస్తే.. దీపక్ భాటియా తన హెచ్ఆర్ హెడ్ పదవిని అడ్డం పెట్టుకొని, కావాలనే తన భర్తకు నైట్ షిఫ్డ్ వేసేవాడని.. దాంతో తన భర్త ఆరోగ్యం క్షీణించిందని పేర్కొంది. అందుకే.. దీపక్‌పై రివేంజ్ తీర్చుకోవడం కోసం ఈ ఘటనకు పాల్పడినట్టు రవ్లీన్ కౌర్ అంగీకరించింది.