NTV Telugu Site icon

UP: తాజ్‌మహల్ రికార్డ్‌ను అధిగమించిన అయోధ్య.. దేంట్లో అంటే..!

Up

Up

అయోధ్య రామమందిరం సరికొత్త రికార్డ్ సొంతం చేసుకుంది. దేశంలోనే మోస్ట్ పాపులర్ పర్యాటక కేంద్రంగా అయోధ్య నిలిచినట్లుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఒకప్పుడు ఆగ్రాలోని తాజ్‌మహల్ పర్యాటకరంగంలో అగ్రగామిగా ఉండేది. ఇప్పుడు దాని రికార్డ్‌ను అయోధ్య బద్దలుకొట్టింది. రికార్డు స్థాయిలో అయోధ్యను సందర్శకులు సందర్శించారని.. తాజ్ మహల్‌ రికార్డ్‌ను అధిగమించిందని యూపీ పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ స్పష్టం చేశారు.

ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 22న అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ప్రధాని మోడీ ఆయోధ్య రామమందిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా అతిరథ మహరథులంతా హాజరయ్యారు. రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తల దగ్గర నుంచి సినీ ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేశారు.

తాజాగా అయోధ్య రామమందిరం సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పింది. అయోధ్య రామమందిరాన్ని చూసేందుకు దేశీయంగానే కాకుండా విదేశీల నుంచి కూడా పెద్ద ఎత్తున సందర్శించేందుకు తరలివచ్చారు. ఆలయం ప్రారంభం అయిన కొద్ది రోజుల్లోనే తాజ్‌మహల్ రికార్డ్‌ను అధిగమించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న తాజ్‌మహల్‌ను ఎక్కువ మంది సందర్శించే టూరిస్ట్ ప్లేస్ ఇదే. దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో వచ్చి సందర్శిస్తుంటారు. అలాంటిది ఇప్పుడు తాజ్‌మహల్‌ కంటే అయోధ్యనే ఎక్కువ మంది సందర్శిస్తున్నారు. తాజాగా దేశ, విదేశాల నుంచి ఎక్కువ మంది సందర్శించిన ప్రాంతం అయోధ్యగా నిలిచింది. జనవరి 2024 నుంచి సెప్టెంబర్ మధ్య అయోధను సందర్శించిన దేశీయ పర్యాటకుల సంఖ్య 13.55 కోట్ల మంది కాగా.. 3, 153 మంది విదేశీ పర్యాటకులు సందర్శించారని ఉత్తర ప్రదేశ్ పర్యాటక శాఖ వెల్లడించింది. అదే సమయంలో తాజ్‌మహల్‌ను 12.51 మంది సందర్శించారు. ఇందులో దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు ఉన్నారు. అంటే ఆగ్రా కంటే అయోధ్యనే ఎక్కువ మంది సందర్శించారని పేర్కొంది. అంటే కేవలం 9 నెలల్లో తాజ్‌మహల్ రికార్డ్‌ను అధిగమించినట్లుగా తెలిపింది.

మొత్తంగా యూపీలోని ఆయా పర్యాటక కేంద్రాలను జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో 47.61 కోట్ల మంది టూరిస్టులు సందర్శించారని తెలిపింది. గత ఏడాది 48 కోట్ల మంది పర్యాటకులు సందర్శిస్తే.. ఈ ఏడాది కేవలం తొమ్మిది నెలల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నట్లు పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. అయోధ్య, తాజ్‌మహల్‌తో పాటు వారణాసి 6.2 కోట్ల మంది స్వదేశీ పర్యాటకులతో పాటు 1.84 లక్షల మంది విదేశీ సందర్శకులను ఆకర్షించింది. ప్రయాగ్‌రాజ్ 4,790 మంది విదేశీయులతో సహా 4.80 కోట్ల మంది పర్యాటకులు సందర్శించారు. కృష్ణుడి జన్మస్థలమైన మధురలో 6.8 కోట్ల మంది సందర్శకులు వచ్చారు. ఇందులో 87,229 మంది అంతర్జాతీయ పర్యాటకులు ఉన్నారు. మీర్జాపూర్‌లో కూడా 1.18 కోట్ల మంది సందర్శకులు వచ్చారు.

తాజ్ మహల్ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తూ ఉండగా.. దేశీయ టూరిస్టుల సంఖ్య మాత్రం కొద్దిగా తగ్గింది. 2022-23లో అంతర్జాతీయంగా వచ్చేవారి సంఖ్య 26.84 లక్షల నుంచి 2023-24 నాటికి 27.70 లక్షలకు పెరిగింది. అయితే దేశీయ పర్యాటకుల సంఖ్య 1.93 లక్షల మేర తగ్గింది.

Show comments