పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది.. ఈనెల 29 నుంచి డిసెంబర్ 23 వరకు శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో ఇవాళ భేటీ అయిన కమిటీ… కోవిడ్ నిబంధనలతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈసమావేశాల్లో నిత్యవసర ధరలతో పాటు సాగు చట్టాలు, పెగాసెస్ వ్యవహారంపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీసే అవకాశముంది… ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధం అవుతుండగా.. విపక్షాలను ఎలా తిప్పికొట్టాలన్న వ్యూహాలపై అధికార పక్షం సిద్ధం అవుతోంది.. దీంతో.. శీతాకాల సమావేశాలు హాట్‌హాట్‌గా సాగే అవకాశం లేకపోలేదు.
29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Parliament