NTV Telugu Site icon

Delhi HC: “భార్యపై తల్లిదండ్రుల అతి ప్రభావం”.. క్రూరత్వమే అంటూ వ్యక్తికి విడాకులు మంజూరు..

Delhi Hc

Delhi Hc

Delhi HC: భార్యపై ఆమె తల్లిదండ్రుల అతి ప్రభావం కూడా క్రూరత్వమే అని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. వివాహ బంధం ఏర్పాటుకు ఆటంకం కలిగిస్తూ.. తల్లిదండ్రుల మితిమీరిన ప్రభావానికి లోనైన భార్య, అతని భర్తపై క్రూరత్వానికి పాల్పడినట్లు పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఓ వ్యక్తి విడాకులు మంజూరు చేసింది. భార్యభర్తల వైవాహిక జీవితంలో కుటుంబ సభ్యులు అనవసరమైన జోక్యాన్ని కలిగి ఉన్నారని, ఇది భర్తకు బాధ కలిగించిందే అని, అందుకు సాక్ష్యాలు ఉన్నాయని జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణతో నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

Read Also: Allu Arjun: బన్నీకి అరుదైన గౌరవం.. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఇండియ‌న్ సినిమాలకు ప్రాతినిధ్యం

భార్యపై ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల అనవసరమైన జోక్యం ఉందని భర్త చెప్పిన వాదనల్లో స్పష్టంగా తెలుస్తోందని కోర్టు చెప్పింది. విడాకులు తిరస్కరించిన ఫ్యామిలీ కోర్టు తీర్పుపై భర్త చేసిన అప్పీల్‌పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. దాదాపుగా 13 ఏళ్లుగా భార్యభర్తలు విడిగా ఉన్నట్లు కోర్టు గుర్తించిందని, భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, అనేక నిందల్ని అతడు భరించాడని, ఇది క్రూరత్వానికి కారణమని హైకోర్టు పేర్కొంది. భార్య తన తల్లిదండ్రుల ప్రభావం నుంచి బయటపడి, భర్తతో సంబంధాన్ని ఏర్పరుచుకునేందుకు ప్రయత్నించలేదని, ఇందులో ఆమె వైఫల్యాన్ని కోర్టు నొక్కి చెప్పింది. అలాంటి ప్రవర్తనను మానసిక క్రూరత్వంగా అభివర్ణించింది. భర్త విడాకులు తీసుకునేందుకు అర్హుడని కోర్టు చెప్పింది.

‘డెడ్ రిలేషన్‌షిప్’ని కొనసాగించడం ఇరుపక్షాలపై ఒత్తిడి తేవడం క్రూరత్వాన్ని కొనసాగించడమే అని కోర్టు చెప్పింది. భర్తపై భార్య, ఆమె కుటుంబీకులు చేసిన తప్పుడు ఫిర్యాదులు మానసిక క్రూరత్వానికి కారణమని చెప్పింది. వైవాహిక జీవితాన్ని పునరుద్ధరించుకునేందుకు భార్య ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఇంత సుదీర్ఘకాలం విడిపోవడం అనేది క్రూరత్వమే అని సమర్ ఘోష్ వర్సెస్ జయ ఘోష్(2007) కేసును ఉటంకిస్తూ కోర్టు వ్యాఖ్యానించింది.