సరిహద్దులో చైనా దూకుడుగా వ్యవహరిస్తుండటంతో మోడీ ప్రభుత్వం సీడీఎస్‌ను నియమించేందుకు సిద్ధం అవుతుంది. మరోవైపు ఇప్పటి వరకు సీడీఎస్‌గా ఉన్న బిపిన్ రావత్ మృతి చెందడంతో కొత్త సీడీఎస్‌గా ఎవరూ వస్తారనే దానిపై చర్చ ప్రారంభం అయింది. బిపిన్ రావత్ మరణంతో దేశం విషాదకర పరిస్థితులు ఉన్నా.. రక్షణ విషయంలో ఆలస్యం చేయకూడదని ప్రధాని మోడీ భావించారట. నిన్న జరిగిన క్యాబినేట్ సమావేశంలో కూడా ఈ విషయం పై చర్చించారని తెలుస్తుంది. త్రివిధ దళాలకు కొత్తగా ఎవరి అధిపతిగా చేయాలనే నిర్ణయంలో ప్రభుత్వ పెద్దలు తలమునకలయ్యారు.
అయితే త్రివిధ దళాలకు కొత్త బాస్ గా ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న మనోజ్ ముకుంద్ నరవణేను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుతం చర్చ జరుగుతోంది. గతంలో బిపిన్ రావత్ కూడా ఆర్మీ చీఫ్‌గా చేసిన తర్వాతే సీడీఎస్‌గా ఎంపిక అయ్యారు. అలాగే ప్రస్తుతం వైస్ సీడీఎస్‌గా ఉన్న ఎయిర్ మార్షల్ రాధాకృష్ణ ను కూడా సీడీఎస్ గా ఎంపిక చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తమిళనాడులోని కూనూమ ప్రాంతం లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెల్సిందే.. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు ఆయన భార్య మధులికతో సహా మొత్తం 13 మంది మరణించారు. సీడీఎస్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు.
