West Bengal: బెంగాల్ బోర్డర్లో టెన్షన్.. తిరిగి వెళ్లేందుకు బంగ్లాదేశీయుల పరుగులు..
- బంగ్లాదేశ్ చొరబాటుదారులపై ఉక్కుపాదం..
- కఠిన చర్యలు తీసుకుంటున్న సీఎం సువేందు అధికారి..
- సరిహద్దుల్లో బారులు తీరుతున్న బంగ్లాదేశీయులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్లో ఉంటున్న బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల్లో భయం మొదలైంది. వలసలపై సీఎం సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ‘‘డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్” విధానాన్ని బెంగాల్ ప్రభుత్వం అవలంభిస్తోంది. ఈ నేపథ్యంలో బెంగాల్లో ఇన్నాళ్లు అక్రమంగా ఉన్న బంగ్లాదేశీయులు, సొంత దేశానికి వెళ్లేందుకు సరిహద్దుల్లో క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర పరగణాలు, మాల్దా జిల్లాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బషీర్హాట్ సబ్‌డివిజన్‌లోని హకీంపూర్ చెక్‌పోస్టు వద్ద వందలాది మంది బంగ్లాదేశీయులు గుమిగూడారు.
ఇలా వెళ్తున్నవారిలో చాలా మంది అక్రమంగా భారత్‌లో నివసిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం హోల్డింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి, అక్రమ వలసదారుల్ని నిర్బంధించాలని ఆదేశించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే సీఎం సువేందు అధికారి అక్రమంగా ఉంటున్న వారికి వార్నింగ్ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA) పరిధిలోకి రాని వారిని అక్రమ చొరబాటుదారులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని బీఎస్ఎఫ్కు అప్పగిస్తారని తెలిపారు.
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
ఈ నేపథ్యంలో మాల్దా జిల్లాలో హోల్డింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇంగ్లీష్ బజార్‌లోని చందన్ పార్క్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ డిటెన్షన్ సెంటర్లో 9 మంది అనుమానిత బంగ్లాదేశీయుల్ని ఉంచారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఆరుగురు మైనర్లు ఉన్నారు. ఈ సెంటర్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసి 24 గంటలు సీసీటీవీ నిఘా, పోలీస్, సివిల్ డిఫెన్స్ బృందాలు సెక్యూరిటీని నిర్వహిస్తున్నాయి. వీరి పౌరసత్వాన్ని నిర్ధారించిన తర్వాత వారి దేశానికి పంపించే ప్రక్రియ ప్రారంభిస్తారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!