Site icon NTV Telugu

Trump Tariff Warning India: మరో 24 గంటల్లో భారత్‌పై భారీగా సుంకాలు పెంచుతాం..

Trump Mama

Trump Mama

Trump Tariff Warning India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారతదేశంపై పెద్ద ఎత్తున సుంకాలు విధించబోతున్నట్లు వార్నింగ్ ఇచ్చారు. రష్యా నుంచి భారత్‌ భారీ ఎత్తున ముడి చమురును కొనుగోలు చేస్తుంది.. ఆ చమురును ఓపెన్ మార్కెట్‌లో అమ్ముతూ.. లాభాలు అర్జిస్తోంది అని అతడు ఆరోపిస్తున్నాడు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌ వేదికగా పోస్ట్ పెట్టాడు. అందులో రష్యా చమురును కొనుగోలు చేస్తున్న భారత్.. లాభాల కోసం దాన్ని అమ్ముకుంటుందన్నారు. భారత్‌- రష్యా నుంచి చేస్తున్న కొనుగోళ్లు, అమ్మకాలు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని మరింత ప్రోత్సహిస్తుందని చెప్పుకొచ్చాడు. అందుకే భారత్‌పై మరిన్ని టారిఫ్‌లను విధిస్తామని వెల్లడించాడు.

Read Also: CM Chandrababu: పీ4పై సీఎం కీలక వ్యాఖ్యలు.. ఆ ప్రచారంపై క్లారిటీ..

ఇక, భారత్‌తో వ్యాపారం చేయడం కష్టంగా ఉందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నాడు. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలియజేశారు. వరుసగా భారత్‌పై ట్రంప్‌ బెదిరింపులకు దిగుతున్నాడు. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లను నిలిపివేయాలని లేకపోతే రాబోయే 24 గంటల్లో మరోసారి భారత్‌పై ఇప్పటికే విధిస్తున్న సుంకాలను మరింత పెంచుతామని హెచ్చరించాడు. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

Exit mobile version