NTV Telugu Site icon

Actor Darshan Case: ‘‘నా కొడుకు పట్టిన గతే దర్శన్‌కి పట్టాలి’’.. రేణుకాస్వామి తల్లిదండ్రులు..

Renuka Swamy

Renuka Swamy

Actor Darshan Case: కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్, అతన అభిమాని అయిన 33 ఏళ్ల రేణుకాస్వామి హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడు. దర్శన్‌కి నటి పవిత్ర గౌడకు ఉన్న సంబంధంపై, తన అభిమాన హీరో కుటుంబాన్ని పాడుచేస్తు్న్నామని రేణుకాస్వామి, పవిత్ర గౌడకు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టు పెట్టడమే అతడి మరణానికి కారణమైంది. చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని దర్మన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి, బెంగళూర్ తీసుకువచ్చి దారుణంగా కొట్టి, చిత్రహింసలు పెట్టి అతను మరణించేలా చేశారు.

ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడలతో పాటు మొత్తం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రేణుకాస్వామి చిత్రహింసలకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. చొక్కా లేకుండా ట్రక్కు ముందు కూర్చొని ఏడుస్తున్న ఫోటో వెలుగులోకి వచ్చింది. మరో దాంట్లో స్పృహ లేకుండా పడి ఉన్న ఫోటో కనిపించింది. అయితే, విచారణ సమయంలో దర్శన్ సహాయకుడి ఫోన్ నుంచి ఈ ఫోటోలను పోలీసులు సేకరించారు.

Read Also: Mercedes-Maybach EQS 680: ఒక్క ఛార్జింగ్‌తో 600 కి.మీ ప్రయాణం.. అదిరిపోయిన ఫీచర్లు

అయితే, రేణుకాస్వామి చిత్రహింసలకు సంబంధించిన ఫోటోలు వెలుగులోకి రావడంతో అతడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అతడి ఫోటోలు చూడటంతో హత్య వెనక ఉన్న వ్యక్తులు తమ కొడుకుని ఎలా చిత్రహింసలు పెట్టారో, వారు కూడా అలాంటి హింసనే అనుభవించాలని అతడి తండ్రి అన్నారు. “నా కొడుకు తప్పు చేశాడని ఒప్పుకున్నా, కనికరం లేకుండా దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. అది నాకు విపరీతమైన బాధ కలిగిస్తుంది. అయినా కనికరం చూపలేదా? శరీర అవయవాన్ని కూడా విడిచిపెట్టకుండా షాక్‌లు ఇచ్చి చిత్రహింసలకు గురిచేశారు. ఒక్కసారి ఊహించుకోండి. దీని గురించి ఆలోచించడం మాకు చాలా బాధ కలిగిస్తుంది” అని తండ్రి కాశీనాథ్ శివనగౌడ అన్నారు.

మేము కన్నీటితో చేతులు కడుక్కుంటున్నాము, ఈ ఫోటోలు చూడటం భరించలేని బాధను కలిగిస్తుందని నేరస్తులను శిక్షిస్తారని ఆశిస్తున్నాను, నా కొడుకు ఎదుర్కొవి వారు ఎదుర్కొంటారు అని అన్నారు. తన కుమార్తె, నా కొడుకు ఫోటోలు చూపించేందుకు ప్రయత్నించింది, వాటిని చూసే శక్తి తనకు లేదని చెప్పానని స్వామి తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. రేణుకా స్వామి ఒంటిపై 39 గాయలు ఉన్నాయి. తలపై లోతైన గాయం ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక చెబుతోంది. ప్రైవేట్ భాగాలకు ఎలక్ట్రిక్ షాక్‌లు ఇచ్చారని, పదేపదే షాక్ ఇవ్వడం వల్ల వృషణాల్లలో ఒకటి బాగా దెబ్బతిన్నట్లు నివేదిక చెప్పింది.

Show comments