NTV Telugu Site icon

Bihar: అసెంబ్లీలో తేజస్వీ యాదవ్-నితీష్ కుమార్ మధ్య మాటల యుద్ధం.. హాట్‌హాట్‌గా అసెంబ్లీ సమావేశాలు

Bihar

Bihar

బీహార్‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్‌హాట్‌గా నడిచాయి. అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్-ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో మాట్లాడిన తేజస్వీ యాదవ్‌.. రాష్ట్రంలో ఆదాయం లేనప్పటికీ బడ్జెట్‌ పెరిగిపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ అంతా అబద్ధాల పుట్ట అని ఆరోపించారు. తన తండ్రి లాలూ ప్రసాద్‌ ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వంలో మాత్రం అన్నీ తప్పుడు లెక్కలేనని తేజస్వీ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. అసెంబ్లీలో ప్రసంగిస్తున్న సమయంలో తేజస్వీ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో బీహార్‌లో అభివృద్ధి ఏమీ జరగలేదని, తన హయాంలోనే జరిగిందని నితీష్ చెప్పుకొచ్చారు. తన వల్లే లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా రాజకీయాల్లో ఎదిగారని నితీష్ కుమార్ చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Kona Venkat: బాద్‌షాకి కాదు బ్రూస్‌లీ’కి డిజప్పాయింట్ అయ్యా!

ఈ ఏడాది శివారులోనే బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారం కోసం బీజేపీ-జేడీయూ కూటమి ప్రయత్నిస్తోంది. ఈసారైనా అధికారం చేజిక్కించుకోవాలని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రయత్నిస్తున్నారు. ఇలా అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ జరగనుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రధాని మోడీ బీహార్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: Maharashtra: హైవేపై బైకర్ నిర్లక్ష్యం.. తప్పించబోయి బస్సు బోల్తా.. వీడియో వైరల్