NTV Telugu Site icon

Amit Shah On Manipur Video: కావాలనే మణిపూర్‌ మహిళల వీడియో లీక్‌ చేశారు: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

Amit Shah

Amit Shah

Amit Shah On Manipur Video: మణిపూర్‌లో ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు.. అనంతరం అత్యాచారం, హత్యకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో దేశం మొత్తం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కీచక పర్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఆ వీడియోను విడుదల చేశారని.. దీని వెనుక కుట్ర దాగి ఉందనేది తేల్చాల్సి ఉందన్నారు. మణిపూర్‌ పరిణామాలు.. కాంగ్పోక్పి మహిళల నగ్న ఊరేగింపు ఘటన కేసుపై సుప్రీం కోర్టుకు హోం శాఖ నివేదించిన అఫిడవిట్‌లోని అంశాలను ఆయన మీడియాకు వివరించారు.

Read also: Bhola Shankar: రాజశేఖర్ స్టైల్ లో చిరంజీవి.. బాసూ మీరు కూడానా!

1990 నుంచి మణిపూర్‌లో జాతుల నడుమ ఘర్షణలు జరుగుతున్నాయని అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై మాట్లాడారు. కేంద్రంలో మణిపూర్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు.. 1993లో నాగా-కుకీ, 1993 మే నెలలో మెయితీ-పంగల్‌, 1995లో కుకీ-తమిళులు, 1997-98 నడుమ కుకీ-మైతీ ఘర్షణలు జరిగాయని కేంద్ర హోం మంత్రి గుర్తు చేశారు. తాజా కుకీ-మైతీ ఘర్షణల్లో భాగంగా మే 4వ తేదీన మహిళలపై జరిగిన దారుణంపైనా స్పందించారు. ఘటనలో వీడియో తీసిన వ్యక్తి అరెస్ట్‌ అయ్యాడు. అతని నుంచి వీడియో తీసిన మొబైల్‌ ఫోన్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నాం. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో.. మోదీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు అభాగ్యులైన కుకీ మహిళలతో కూడిన వీడియోను వైరల్‌ చేసి ఉంటారని భావిస్తున్నామన్నారు. వీడియోను కుట్రతోనే.. ఉద్దేశపూర్వకంగా లీక్‌ చేసి ఉంటారని అనుకుంటున్నాం. ఈ కుట్రను తేల్చేందుకే దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. మణిపూర్‌ ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందు 2022లో మయన్మార్‌లో జరిగిన సంఘటనల తాలుకా రెండు వీడియోలను సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారు. వాటికి సంబంధించి కూడా మణిపూర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని తెలిపారు.

Read also: Hepatitis Warning Sign: హెపటైటిస్ వ్యాధి ఎయిడ్స్‌ కంటే ప్రమాదమైంది.. సంకేతాలు ఇవే!

మణిపూర్‌ ఘటనకు సంబంధించిన కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. ఆరు కేసులను ఇప్పటికే సీబీఐకి పంపాం. ఏడోది కూడా పంపాల్సి ఉంది. మరో మూడు కేసుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి అప్పగించాం. దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగుతుందని హామీ ఇస్తున్నాం. మణిపూర్‌ వీడియో ఘటన కేసు ట్రయల్‌ కూడా మణిపూర్‌ బయటే జరగడం సబబుగా భావిస్తున్నాం. అందుకే సుప్రీంకు విజ్ఞప్తి చేశామన్నారు. మణిపూర్‌మహిళల ఊరేగింపు సమయంలో.. అక్కడ పోలీసులుగానీ, ఆర్మీగానీ లేదని తేలింది. ఇటు నిఘా సంస్థలుగానీ, అటు హోం శాఖ గానీ.. వీడియోకు సంబంధించిన ఎలాంటి క్లూస్‌ దొరకలేదని వెల్లడించారాయన. అదే సమయంలో నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని మాత్రం స్పష్టం చేశారు. మణిపూర్‌ అల్లర్లకు సంబంధించి ఇప్పటిదాకా 6,065 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయని తెలిపారు. కేంద్రం జోక్యం తర్వాత మణిపూర్‌ పరిస్థితి కొంతవరకు అదుపులోకి వచ్చింది. జులై 18వ తేదీ నుంచి మణిపూర్‌లో మరో మరణం సంభవించకుండా చూశామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మీడియాకు వివరించారు. మే 3వ తేదీ నుంచి జరుగుతున్న మణిపూర్‌ ఘర్షణలకు ఇప్పటి వరకు 147 మంది మరణించగా.. 40 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని.. 72 శాతం ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరారని.. 82 శాతం మంది విద్యార్థులు తిరిగి బడి బాట పట్టారని వెల్లడించారు. వీలైనంత త్వరలో మణిపూర్‌ గడ్డపై శాంతిభద్రతలు పూర్తిస్థాయిలో సాధారణం అవుతాయని భావిస్తున్నట్లు అమిత్‌ షా మీడియాకు వివరించారు.

Show comments