NTV Telugu Site icon

Cyclone Biparjoy: సౌరాష్ట్రను తాకిన తుఫాన్ “వాల్ క్లౌడ్స్”.. అర్థరాత్రి వరకు తుఫాన్ తీరం దాటే ప్రక్రియ

Biparjoy 1

Biparjoy 1

Cyclone Biparjoy: గుజరాత్ తీరాన్ని ముంచెత్తడానికి ‘బిపార్జాయ్’ తుఫాన్ ముంచుకొస్తుంది. మరికొన్ని గంటల్లలో గుజరాత్ తీరాన్ని తాకనుంది. ఇదిలా ఉంటే తుఫాన్ వస్తుందనే ముంచుకొస్తుందనే సూచనలు వెలువడుతున్నాయి. తుఫాన్ ‘వాల్ క్లౌడ్స్’గా పిలిచే మేఘాలు గురువారం సాయంత్రం గుజరాత్ లోని సౌరాష్ట్ర తీరాన్ని తాకాయి. గుజరాత్ కచ్ జిల్లాలోని జఖౌ ఓడరేవు వద్ద తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ ప్రకటించింది.

Read Also: The Earth: ఇప్పుడైతే భూమిపై 24 గంటలు.. ఒకప్పుడు 19 గంటలు మాత్రమే..

గత 60 ఏళ్లలో గుజరాత్ వద్ద తీరాన్ని దాటుతున్న మూడో తుఫానుగా బిపర్జాయ్ రికార్డ్ క్రియేట్ చేసింది. తుఫాన్ తీరాన్ని దాటడం 6-8 గంటల మధ్య ప్రారంభమై అర్థరాత్రి వరకు కొనసాగనుంది. ప్రస్తుతం తుఫాన్ జఖౌ పోర్టుకు పశ్చిమ-నైరుతి దిశలో 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ‘ వాల్ క్లౌడ్స్’ మేఘాలు తీరాన్ని తాకాయి. ఇవి సాధారణంగా ఉండే మేఘాల కింద ఉంటాయి. ఇవి సుడిగాలి ఏర్పాటును, తుఫాన్ తీరం దాటే ప్రారంభ దశను సూచిస్తాయి.

మరోవైపు గుజరాత్ లోని తీర ప్రాంత 8 జిల్లాలకు అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. 94,000 మందిని అధికారులు తాత్కాలికి శిబిరాలకు తరలించారు. గత ఆరు గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తూర్పు-ఉత్తరం వైపు గుజరాత్ తీరం వైపు కదిలిన తుఫాను, సౌరాష్ట్ర-కచ్ మరియు ఆనుకుని ఉన్న పాకిస్థాన్ తీరాల మధ్య జఖౌ నౌకాశ్రయం సమీపంలో పాకిస్థాన్‌లోని కచ్ జిల్లాలోని మాండ్వీ మరియు కరాచీ మధ్య తీరాన్ని దాటుతుంది.

Show comments