NTV Telugu Site icon

Doctors safety: డాక్టర్ భద్రత కోసం రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు..

Safety Of Doctors

Safety Of Doctors

Doctors safety: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, ఆస్పత్రి ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన డాక్టర్ భద్రను ప్రశ్నార్థకంగా మార్చింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. చివరకు సుప్రీంకోర్టు కలగజేసుకోవడంతో ఆందోళన విరమించారు. ఇప్పటికే డాక్టర్ల భద్రతను నిర్ధారించేందుకు అత్యున్నత న్యాయస్థానం ఓ కమిటిని ఏర్పాటు చేసింది.

ఇదిలా ఉంటే, తాజాగా కేంద్రం డాక్టర్ల భద్రత కోసం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. హెల్త్ వర్కర్లకు, డాక్టర్లకు భద్రతను నిర్ధారించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు మరియు డీజీపీలకు లేఖ రాసింది. వైద్య సంస్థల్లో వైద్యులపై పెరుగుతున్న హింసాత్మక సంఘటనల్ని దృష్టిలో ఉంచుకుని, ఇలాంటి కేసులను నిరోధించడానికి వారికి ఆదేశాలు ఇచ్చింది.

రాష్ట్రాల అధికారులు ‘‘ వైద్యుల భద్రతపై వారి ఆందోళనల్ని నివృత్తి చేసేందుకు నేషనల్ టాస్క్ ఫోర్స్ (NTF) నివేదిక అందే వరకు కొన్ని ప్రాథమిక కనీస అవసరాలు అందుబాటులో ఉంచాలి’’ రెండు వారాల్లో పరిస్థితి యొక్క అత్యవసర దృష్ట్యా నివారణ మరియు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

Read Also: CM Revanth Reddy: ‘హైడ్రా’ పరిధిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

కేంద్రం ఇచ్చిన ఆదేశాలు:

1. భద్రతను మెరుగుపరచడం మరియు ఆరోగ్య సంరక్షణ కార్మికులకు సురక్షితమైన పని వాతావరణాన్ని అందించడం.

2. ఆరోగ్య సంరక్షణ కార్మికుల రక్షణ కోసం రాష్ట్ర చట్టాలను మరియు భారతీయ న్యాయ సంహిత (BNS) సంబంధిత చట్టాలను అందుకు సంబంధించిన శిక్షల వివరాలను స్థానిక భాష, ఇంగ్లీష్‌లో ఆసుపత్రి ఆవరణలోని ప్రముఖ ప్రదేశాలలో ప్రదర్శించాలి.

3. తగిన భద్రతా చర్యలను వ్యూహరచన చేయడానికి మరియు అమలు చేయడానికి సీనియర్ వైద్యులు మరియు పరిపాలనా అధికారులతో కూడిన ‘హాస్పిటల్ సెక్యూరిటీ కమిటీ’ మరియు ‘వయలెన్స్ ప్రివెన్షన్ కమిటీ’ ఏర్పాటు.

4. కఠినమైన సందర్శకుల పాస్ విధానాన్ని అనుసరించడం ద్వారా ఆసుపత్రిలోని ముఖ్య ప్రాంతాలకు పబ్లిక్ మరియు రోగి బంధువులకు యాక్సెస్‌ను నియంత్రించడం.

5. రాత్రి విధుల సమయంలో ఆసుపత్రిలోని వివిధ బ్లాక్‌లు, హాస్టల్ భవనాలు మరియు ఇతర ప్రాంతాలలో సురక్షితంగా వెళ్లేందుకు రెసిడెంట్ వైద్యులు లేదా నర్సుల ఏర్పాట్లు చేయాలి.

6. నివాస మరియు హాస్టల్ బ్లాక్‌లు మరియు ఇతర ఆసుపత్రి ప్రాంగణాలలోని అన్ని ప్రాంతాలలో సరైన లైటింగ్ ఉండేలా చూసుకోవాలి.

7. ఆసుపత్రులలో 24×7 మనుషులతో కూడిన భద్రతా నియంత్రణ గదిని ఏర్పాటు చేయండి. రాత్రి సమయంలో అన్ని హాస్పిటల్ ప్రాంగణాల్లో సాధారణ భద్రతా పెట్రోలింగ్‌ను అనుసరించాలి.

8. సమీప పోలీస్ స్టేషన్‌తో సన్నిహిత సహకారాన్ని ఏర్పరచుకోవాలి.

9. ఆసుపత్రిలో లైంగిక వేధింపులపై అంతర్గత కమిటీ ఏర్పాటు చేయాలి.

10. ఆసుపత్రి ప్రాంగణంలోని అన్ని CCTV కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి పనితీరును పర్యవేక్షించాలి.