TVK Vijay: విజయ్ ప్రమాణస్వీకారం సమయం మార్పు.. ఎప్పుడంటే..!

  • విజయ్ ప్రమాణస్వీకారం సమయం మార్పు
  • ప్రెస్‌నోట్ విడుదల చేసిన లోక్‌భవన్
Tamilvijay

Tamilvijay

ఎట్టకేలకు తమిళనాడు ట్విస్ట్‌లకు ఫుల్‌స్టాప్ పడింది. ఆదివారం ఉదయం 10 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేస్తారని లోక్‌భవన్ అధికారికంగా ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది. దీంతో విజయ్ ప్రమాణస్వీకారంపై ఓ క్లారిటీ వచ్చేసింది. తొలుత ఆదివారం మధ్యాహ్నం 3:15 గంటలకు అని వార్తలు వచ్చాయి. చివరికి లోక్‌భవన్ ప్రకటనతో క్లారిటీ వచ్చింది. ఇక బలనిరూపణకు కేవలం 3 రోజులే గడువు ఇచ్చారు. ఈనెల 13 లోపు అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని సూచించారు.

శనివారం సాయంత్రం 6:30 గంటలకు నాలుగో సారి గవర్నర్ అర్లేకర్‌ను విజయ్ కలిశారు. దాదాపు గంటా నలభై నిమిషాల పాటు సమావేశం జరిగింది. ప్రమాణస్వీకారానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను విజయ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్‌కు గవర్నర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

×
×
Ad

ఇక విజయ్‌తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున అభిమానులు, ప్రముఖులు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

సోమవారం వెలువడిన ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే మాత్రమే 108 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించవచ్చని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా అంచనాలు తారుమారయ్యాయి. పూర్తి మ్యాజిక్ ఫిగర్‌తో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని విజయ్‌కు సూచించారు. దీంతో కాంగ్రెస్, వామపక్షాల మద్దతు ఇవ్వడంతో విజయ్ బలం 116కు చేరింది. అయితే మరో రెండు స్థానాలు ఉన్న వీసీకేకు చెందిన పార్టీ మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తగ్గింది. దీంతో మ్యాజిక్ ఫిగర్‌కు విజయ్ చేరుకోకపోవడంతో రాజకీయ అనిశ్చితి అలానే కొనసాగుతోంది. మొత్తానికి శనివారం వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వీసీకేతో పాటు ముస్లిం లీగ్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. దీంతో విజయ్ బలం 120కి చేరింది.