TVK Vijay: విజయ్ ప్రమాణస్వీకారం సమయం మార్పు.. ఎప్పుడంటే..!
- విజయ్ ప్రమాణస్వీకారం సమయం మార్పు
- ప్రెస్‌నోట్ విడుదల చేసిన లోక్‌భవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎట్టకేలకు తమిళనాడు ట్విస్ట్‌లకు ఫుల్‌స్టాప్ పడింది. ఆదివారం ఉదయం 10 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేస్తారని లోక్‌భవన్ అధికారికంగా ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది. దీంతో విజయ్ ప్రమాణస్వీకారంపై ఓ క్లారిటీ వచ్చేసింది. తొలుత ఆదివారం మధ్యాహ్నం 3:15 గంటలకు అని వార్తలు వచ్చాయి. చివరికి లోక్‌భవన్ ప్రకటనతో క్లారిటీ వచ్చింది. ఇక బలనిరూపణకు కేవలం 3 రోజులే గడువు ఇచ్చారు. ఈనెల 13 లోపు అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని సూచించారు.
శనివారం సాయంత్రం 6:30 గంటలకు నాలుగో సారి గవర్నర్ అర్లేకర్‌ను విజయ్ కలిశారు. దాదాపు గంటా నలభై నిమిషాల పాటు సమావేశం జరిగింది. ప్రమాణస్వీకారానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను విజయ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్‌కు గవర్నర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Also Read
- Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
- Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
- UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
- Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
ఇక విజయ్‌తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున అభిమానులు, ప్రముఖులు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
సోమవారం వెలువడిన ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే మాత్రమే 108 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించవచ్చని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా అంచనాలు తారుమారయ్యాయి. పూర్తి మ్యాజిక్ ఫిగర్‌తో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని విజయ్‌కు సూచించారు. దీంతో కాంగ్రెస్, వామపక్షాల మద్దతు ఇవ్వడంతో విజయ్ బలం 116కు చేరింది. అయితే మరో రెండు స్థానాలు ఉన్న వీసీకేకు చెందిన పార్టీ మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తగ్గింది. దీంతో మ్యాజిక్ ఫిగర్‌కు విజయ్ చేరుకోకపోవడంతో రాజకీయ అనిశ్చితి అలానే కొనసాగుతోంది. మొత్తానికి శనివారం వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వీసీకేతో పాటు ముస్లిం లీగ్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. దీంతో విజయ్ బలం 120కి చేరింది.
#UPDATE | The time for the oath ceremony of Tamil Nadu CM-designate Vijay has been changed to 10 am tomorrow, 10th May. https://t.co/hHRLN7ewWO pic.twitter.com/ABRKwP8k3T
— ANI (@ANI) May 9, 2026
తాజావార్తలు
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!