Site icon NTV Telugu

Vijay: కరూర్ తొక్కిసలాట.. విజయ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన రద్దు.

Tvk Vijay Karur Stampede

Tvk Vijay Karur Stampede

Vijay: తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత, స్టార్ యాక్టర్ విజయ్ నిర్వహించిన ర్యాలీ విషాదకరంగా ముగిసింది. కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇది ఆ రాష్ట్రంలో రాజకీయంగా విమర్శలు ప్రతివిమర్శలకు కారణమైంది. అధికార డీఎంకే పార్టీ మాట్లాడుతూ.. విజయ్ పోలీసుల నిబంధనలు, నియమాలను ఉల్లంఘించినట్లు ఆరోపించింది. ఈ వ్యవహారంలో డీఎంకే కుట్ర ఉందని విజయ్ పార్టీ ఆరోపించింది. స్వతంత్ర సంస్థ లేదా సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.

Read Also: AP Crime: కీచకపర్వం.. ప్రియుడి గొంతుపై కత్తి పెట్టి.. ప్రియురాలి గ్యాంగ్ రే*ప్‌..

ఇదిలా ఉంటే, ఈ విషాదకర ఘటన తర్వాత విజయ్ తన రాష్ట్ర వ్యాప్త పర్యటన రద్దు చేసుకున్నారు. తొక్కిసలాట తర్వాత విజయ్ ర్యాలీలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ర్యాలీని కొన్ని రోజుల వరకు రద్దు చేయాలని టీవీకే భావించినట్లు తెలుస్తోంది. రెండు వారాల పాటు తన పర్యటన రద్దు చేసుకున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది.

Exit mobile version