Site icon NTV Telugu

Vijay Reacts to Divorce Controversy: విడాకుల వ్యవహారంపై స్పందించిన విజయ్.. నేను చూసుకుంటా..!

Tvk

Tvk

Vijay Reacts to Divorce Controversy: సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ చుట్టూ ముసురుకున్న వివాదాలపై ఎట్టకేలకు స్పందించారు. ఆ సమస్యల కారణంగా అభిమానులు, ప్రజలు ఇబ్బంది పడుతుంటే తనకు బాధగా ఉందని వ్యాఖ్యానించారు టీవీకే విజయ్‌.. “ఇటీవల ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందుల గురించి మీరు ఆలోచించాల్సిన పనిలేదు.. వాటిపై మీరు పోరాటం చేసి వాళ్లను బాధించాల్సిన అవసరం అంతకన్నా లేదు. అవన్నీ నేను చూసుకుంటాను.. మీరు చేయాల్సిందల్లా ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే” అని పిలుపునిచ్చారు టీవీకే అధ్యక్షుడు విజయ్ ..

Read Also: Ustaad Bhagat Singh Trailer: ‘ఇది భగత్‌ గీత.. దమ్మున్నొడు దాటొచ్చు’.. ‘ఉస్తాద్’ ఊచకోత!

ఇక, ఉమెన్స్ డే సందర్భంగా మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న విజయ్.. మహిళలకు కోసం సూపర్ సిక్స్ పేరుతో హామీలు గుప్పించారు.. ప్రతినెల మహిళ ఖాతాల్లో రెండున్నర వేల రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చారు.. రాష్ట్రంలోని ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మినహా మిగతా అందరికీ ఈ పథకం వర్తింపజేయనున్నట్టు వెల్లడించారు.. ఇక, అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్టు మరో హామీ ఇచ్చారు.. ఇక, పాఠశాల చిన్నారులకు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం చేస్తామన్నారు విజయ్.. మరోవైపు.. మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పాటు చేస్తామన్నారు.. అంతేకాకుండా మహిళలపై నేరాల కేసులను త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇక, పెళ్లి చేసుకునే యువతులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన విజయ్.. పెళ్లి చేసుకునేవారికి ఒక తులం బంగారం కానుకగా ఇస్తామని తెలిపారు.. పేదలకు ఏటా ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నట్టు హామీలు గుప్పించారు టీవీకే అధ్యక్షుడు విజయ్..

Exit mobile version