Site icon NTV Telugu

Thalapathy Vijay : పునీత్‌ రాజ్‌కుమార్‌కు నివాళులు అర్పిస్తూ.. భావోద్వేగం..

కన్నడ పవర్ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ (46) అకాల మరణంపై యావత్‌ సినిమా ఇండస్ట్రీ షాక్‌కి గురైన విషయం తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ మరణించడాన్ని అతని ఫ్యాన్స్, కన్నడ ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. హఠాత్తుగా తమ హీరో మరణించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే గుండె పోటు రావడంతో పునీత్ రాజ్ కుమార్ మరణించారు.

ఆయన మరణం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులను, ప్రజలను కంట నీరు పెట్టించింది. ఆయన రూపాన్ని.. ఆయన సినిమాల్లో చూసుకుంటున్నారు అభిమానులు. ఇది ఇలా ఉండగా దివంగత కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్ కుమార్ సమాధిని దర్శించి నివాళులు అర్పించారు తమిళ నటుడు ఇళయదళపతి విజయ్. బెంగుళూరులో పునీత్ రాజ్‌ కుమార్‌కి నివాళులు అర్పించిన అనంతరం పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు విజయ్. అయితే పునీత్ రాజ్ కుమార్ సమాధి వద్ద హీరో విజయ్… కాస్త ఎమోషనల్ అయ్యారు. అంతే కాదు పునీత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ఇక దీనికి సంభందించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

Exit mobile version