NTV Telugu Site icon

Snake In Train: రైలు ఏసీ కోచ్‌లో పాము.. వైరల్ అవుతున్న వీడియో..

Snake

Snake

Snake In Train: భారత రైల్వేలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లతో ఆధునాతనంగా మారుతోంది. మరోవైపు రైళ్లు పట్టాలు తప్పడం, వాటర్ లీకేజీలు, నాణ్యత లేని ఆహారంతో కొన్నిసార్లు అభాసుపాలవుతోంది. కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ ఎప్పటికప్పుడు భారతీయ రైళ్లలో మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కసరత్తు చేస్తూనే ఉంది. అయినా అక్కడక్కడ లోపాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి.

Read Also: Gaza War: గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. ఏడుగురు మృతి

తాజాగా రైలులో విషపూరితమైన పాము ప్రత్యక్షమైంది. ఏసీ కోచ్‌లో ఏసీ డక్ట్ నుంచి పాము బయటకు వచ్చింది. ఏసీ డక్ట్ నుంచి పాము బయటకు రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ జబల్‌పూర్-ముంబై మధ్య నడిచే గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌‌లో జరిగింది. కోచ్ జీ3లో సీటు నంబర్ 23కి సమీపంలో పాము కనిపించింది.

పాము బోగీలో వేలాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రైలు కసరా రైల్వే స్టేషన్ చేరుకోగానే ప్రయాణికులు పాము కనిపించింది. వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. గతంలో నీటి లీకేజీలకు సంబంధించిన ఘటనలు నమోదయ్యాయి. కానీ ఇటా ఒక విషసర్పం రైలులోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.