Dog Attack: దేశంలోని పలు ప్రాంతాల్లో వీధికుక్కల దాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, మహిళలు వీటికి టార్గెట్‌గా మారుతున్నారు. కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లో ఓ వృద్ధరాలిపై కుక్కల గుంపు దాడి చేసింది. పంజాబ్ ఖన్నాలోని నాగరిక నాయి అబాది ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
Read Also: Uber And Ola: “ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లకు వేర్వేరు ధరలు”.. ఉబర్, ఓలాకు కేంద్రం నోటీసులు..
ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మహిళను కింద పడేసి కుక్కలు దాడి చేస్తున్నట్లు వీడియోలో ఉంది. కుక్కల దాడి నుంచి తప్పించుకునేందుకు మహిళ గేటు లోపలకి వెళ్లాలని భావించింది. అయితే, సకాలంలో చేరలేకపోయింది. కొన్ని సెకన్లలోనే ఒక కుక్క ఆమె కాలుని పట్టుకుని లాగింది. కొద్దిసేపటికే మరికొన్ని కుక్కలు వచ్చి ఆమె చేతిపై, ముఖంపై దాడి చేశాయి. కుక్కల్ని చెదరగొట్టడానికి ఒక వ్యక్తి ఇంట్లో నుంచి వస్తువులు విసిరివేయడంతో కుక్కలు వెళ్లిపోయాయి. వృద్ధురాలి శరీరంపై 15 గాయాలయ్యాయి. ఈ ప్రాంతంలో కుక్కల దాడులు పెరుగుతున్నట్లు స్థానికులు ఆరోపించారు.