Site icon NTV Telugu

Vice Presidential Poll Live Updates: ఉపరాష్ట్రపతి ఎన్నికల లైవ్ అప్‌డేట్స్

Vice Presidential Poll Live Updates

Vice Presidential Poll Live Updates

Vice Presidential Poll Live Updates: భారత 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఎన్డీయే కూటమి తరఫున పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌కర్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి, గవర్నర్‌ మార్గరెట్‌ అల్వా బరిలో ఉన్నారు. ఈ ఎన్నికకు సంబంధించి పోలింగ్ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు పార్లమెంట్ భవనంలో కొనసాగనుంది. పార్లమెంట్ భవనం మొదటి అంతస్తులోని రూమ్ నెం.63లో పోలింగ్ జరుగుతోంది. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఈ పోలింగ్ జరుగుతోంది. నూతన ఉపరాష్ట్రపతిని లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు ఎన్నుకోనున్నారు. లోక్‌సభకు చెందిన 543, రాజ్యసభకు చెందిన 245 మంది ఎన్నికలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో జమ్మూకశ్మీర్‌ నుంచి 4, త్రిపుర నుంచి 1, నామినేటెడ్‌ సభ్యులనుంచి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తం 780 మందికి ఓటు వేసే హక్కు ఉంది. ఇందులో లోక్‌సభలో 23, రాజ్యసభలో 13 మంది సభ్యుల సంఖ్యాబలం ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించినందున ఆ పార్టీకి చెందిన 36 మంది సభ్యులు మినహాయించి మిగిలిన 744 మంది ఓటింగ్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంది. పోలింగ్ తర్వాత సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉండనుంది. అంటే ఈ రోజే భారత నూతన రాష్ట్రపతి ఎవరో తేలిపోనుంది.

The liveblog has ended.
  • 06 Aug 2022 08:00 PM (IST)

    జగదీప్ ధనకర్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‌కర్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

  • 06 Aug 2022 07:54 PM (IST)

    ఉప రాష్ట్రపతిగా జగ్ దీప్ ధన్‌కర్‌ ఘన విజయం

    భారత ఉపరాష్ట్రపతిగా జగ్ దీప్ ధన్‌కర్‌ విజయం సాధించారు. తన ప్రత్యర్థి, విపక్షాల అభ్యర్థి మార్గరేట్ ఆల్వాపై భారీ విజయం నమోదు చేశారు. మొత్తం పార్లమెంట్ సభ్యుల ఓట్లలో 528 ఓట్లు ధన్‌కర్‌ కు రాగా.. మార్గరేట్ ఆల్వాకు కేవలం 182 ఓట్లు మాత్రమే వచ్చాయి. 15 ఓట్లు చెల్లలేదు. దీంతో 346 ఓట్ల భారీ ఆధిక్యంతో జగ్ దీప్ ధన్‌కర్‌ భారీ విజయాన్ని సాధించారు.

  • 06 Aug 2022 06:37 PM (IST)

    కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి నివాసానికి జగదీప్ ధంకర్

    మరికొన్ని గంటల్లో ఉప రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. తాజాగా ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధంకర్, ఢిల్లీలోని 11 అక్బర్ రోడ్ లో ఉన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసానికి వెళ్లారు.

     

     

  • 06 Aug 2022 06:32 PM (IST)

    ఉప రాష్ట్రపతి ఎన్నిక.. ఓట్ల లెక్కింపు ప్రారంభం

    ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పార్లమెంట్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా పార్లమెంట్ లో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి.

  • 06 Aug 2022 05:30 PM (IST)

    ముగిసిన పోలింగ్

    ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 93 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం అందుతోంది. కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది.

  • 06 Aug 2022 03:59 PM (IST)

    మధ్యాహ్నం 2 గంటల వరకు 85 శాతం పోలింగ్

    ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు దాదాపు 85% పోలింగ్ జ‌రిగింది. మెజారిటీ ఎంపీలు త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంట‌ల త‌రువాత పోలింగ్ ముగుస్తుంది.

  • 06 Aug 2022 02:05 PM (IST)

    ఓటేసిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా

    లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఢిల్లీలోని పార్లమెంట్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటు వేశారు.

  • 06 Aug 2022 01:54 PM (IST)

    కొనసాగుతున్న పోలింగ్.. ఓటేసిన రాహుల్‌గాంధీ, పలువురు కాంగ్రెస్ ఎంపీలు

    పార్లమెంట్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం పోలింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీలు శశిథరూర్, జైరాం రమేష్, మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, కె సురేష్ తమ ఓటు వేశారు.

  • 06 Aug 2022 01:40 PM (IST)

    ఓటేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటు వేశారు.

  • 06 Aug 2022 01:27 PM (IST)

    పార్లమెంట్‌లో కేంద్ర మంత్రితో సంభాషించిన మార్గరెట్ అల్వా

    ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో సంభాషించారు. ఓ వైపు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతుండగా.. ఆమె సరదాగా కేంద్రమంత్రితో మాట్లాడారు.  ఆ సమయంలో మార్గరెట్ నవ్వుతూ కనిపించారు.

  • 06 Aug 2022 01:17 PM (IST)

    ఓటేసిన కేంద్ర మంత్రులు హర్‌దీప్‌సింగ్‌ పూరీ, నారాయణ్‌ రాణే, సర్బానంద సోనోవాల్‌

    ఢిల్లీలోని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులు హర్‌దీప్‌సింగ్‌ పూరీ, నారాయణ్‌ రాణే, సర్బానంద సోనోవాల్‌ ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటు వేశారు.

  • 06 Aug 2022 01:16 PM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ ఎంపీ హేమమాలిని

    బీజేపీ ఎంపీ హేమమాలిని ఢిల్లీలోని పార్లమెంట్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటు వేశారు.

  • 06 Aug 2022 01:13 PM (IST)

    ఓటేసిన కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ

    కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీ  పార్లమెంట్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం తమ  ఓటు హక్కును వినియోగించుకున్నారు.

     

  • 06 Aug 2022 12:57 PM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న పలు పార్టీల ఎంపీలు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఆప్ ఎంపీలు హర్భజన్ సింగ్, సంజయ్ సింగ్, డీఎంకే ఎంపీ కనిమొళి, బీజేపీ ఎంపీ రవికిషన్ తమ ఓటు వేశారు.

  • 06 Aug 2022 12:05 PM (IST)

    పార్లమెంట్‌కు విచ్చేసిన విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా

    ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ అల్వా పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఎన్నికలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతుండగా.. రాత్రి వరకు ఫలితాలు కూడా రానున్నాయి.

  • 06 Aug 2022 11:55 AM (IST)

    పార్లమెంట్‌లో ఓటేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

    ఉపరాష్ట్రపతి ఎన్నికలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్‌లో ఎంపీలు ఓటు వేశారు. ఎన్డీయే అభ్యర్థి జగదీప్‌ ధన్‌కర్‌కు వైఎస్సార్‌సీపీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.

  • 06 Aug 2022 11:39 AM (IST)

    ఓటేసిన కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్

    పార్లమెంట్‌లో ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్ ఓటు వేశారు.

  • 06 Aug 2022 11:36 AM (IST)

    నడ్డాతో కలిసి ఓటేసిన కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్

    పార్లమెంట్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో కలిసి ఓటు వేశారు.

  • 06 Aug 2022 11:34 AM (IST)

    ఓటేసిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్

    రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

     

  • 06 Aug 2022 11:21 AM (IST)

    ఓటేసిన కేంద్ర మంత్రులు

    కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్, వి మురళీధరన్ ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం తమ ఓటు వేశారు.

  • 06 Aug 2022 11:08 AM (IST)

    ఓటుహక్కును వినియోగించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

    కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్డీయే కూటమి తరఫున పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

  • 06 Aug 2022 11:06 AM (IST)

    ఓటేసిన కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు

    కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం, డీఎంకే ఎంపీలు దయానిధి మారన్, తిరుచ్చి శివ పార్లమెంటులో ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం తమ ఓటు వేశారు. ఎన్డీయే కూటమి తరఫున పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌కర్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి, గవర్నర్‌ మార్గరెట్‌ అల్వా బరిలో ఉన్నారు. ఈ ఎన్నికకు సంబంధించి పోలింగ్ సాయంత్రం 5 గంటలవరకు పార్లమెంట్ భవనంలో కొనసాగనుంది.

  • 06 Aug 2022 11:01 AM (IST)

    ఓటేసిన కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, రాజీవ్ చంద్రశేఖర్

    పార్లమెంట్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, రాజీవ్ చంద్రశేఖర్ ఓటు వేశారు.

  • 06 Aug 2022 10:59 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

    పార్లమెంట్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం మాజీ ప్రధాని, కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మన్మోహన్ సింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీలు చైర్‌లో వచ్చి ఓటేశారు.

  • 06 Aug 2022 10:37 AM (IST)

    ఓటేసిన కేంద్రమంత్రులు జితేంద్ర సింగ్, అశ్విని వైష్ణవ్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, అశ్విని వైష్ణవ్‌లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 06 Aug 2022 10:32 AM (IST)

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని మోదీ

    పార్లమెంట్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఓటు వేశారు. పార్లమెంట్ భవనం మొదటి అంతస్తులోని రూమ్ నెం.63లో ఆయన ఓటేశారు. ఎన్డీయే కూటమి తరఫున పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ బరిలోన నిలిచిన విషయం తెలిసిందే.

  • 06 Aug 2022 10:28 AM (IST)

    ఓటుహక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్‌ ఎంపీలు

    ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వాకు టీఆర్ఎస్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

Exit mobile version