NTV Telugu Site icon

Sabarimala Yatra: లోయలో పడిన శబరియల యాత్రికుల వాహనం.. 8మంది భక్తులు మృతి

Tragedy In Sabarimala Yatra

Tragedy In Sabarimala Yatra

Tragedy in Sabarimala Yatra: శబరిమల యాత్రలో విషాదం చోటుచేసుకుంది. శబరిమల యాత్రికులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడి ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడు నుంచి యాత్రికులు ప్రయాణిస్తున్న వాహనం ఇడుక్కి జిల్లా కుమిలి-కంబం రహదారిపై వెళ్తుండగా వాగులోకి బోల్తా పడింది. కొందరు ఆప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Read also: Rains Alert: మరో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజులు వర్షాలు

వాహనంలో ఓ చిన్నారి సహా తొమ్మిది మంది ఉన్నారు. గాయపడిన ఇద్దరిని కుమిలిలోని ఆసుపత్రికి తరలించారు. వాహనంలో ఇంకా ముగ్గురు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. వారిని వాహనం నుంచి బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈఘటన ఇడుక్కి జిల్లా కలెక్టర్ కు సమాచారం అందడంతో.. అర్థరాత్రి అక్కడకు చేరుకున్న కలెక్టర్‌ రెస్క్యూ ఆపరేషన్‌ చేసి క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
Boy Saves His Mother: తల్లిని రక్షించిన చిన్న పిల్లవాడు.. నోటిజన్లు ట్రోల్‌

Show comments