Site icon NTV Telugu

Vaccination: గుడ్‌న్యూస్.. 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఎల్లుండి నుంచే..

vaccination

ప్రపంచాన్ని ఇప్పటికీ వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.. గతేడాది జనవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభం అయ్యింది.. క్రమంగా ఏజ్‌ గ్రూప్‌ను తగ్గిస్తూ వస్తున్నారు.. ఇక, ఇప్పటికే 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కూడా వ్యాక్సినేషన్‌ కోసం ప్రభుత్వం గ్రీన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే కాగా.. 12 నుండి 14 సంవత్సరాల వయస్సు గల వారికి టీకా కార్యక్రమాన్ని ఎల్లుండి (మార్చి 16వ తేదీ) నుంచి ప్రారంభించనున్నారు.. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు.. మరోవైపు, ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారికి.. బూస్టర్‌ డోసు కూడా ప్రారంభం కాగా.. సీనియర్ సిటిజన్‌లకు బూస్టర్ డోస్ ఇచ్చేందుకు కో-మార్బిడిటీ తప్పనిసరి నిబంధనను తొలగించింది కేంద్రం.

మొత్తంగా 12 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్‌ బుధవారం నుంచి ప్రారంభంకాబోతోంది.. అలాగే 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు బూస్టర్ డోస్ అందించడానికి కో మార్బిడిటీ నిబంధనను తీసివేయనున్నారు. కాగా, విశ్వరూపం చూపించిన కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టేందుకు వ్యాక్సినేషన్‌ తీసుకొచ్చింది ప్రభుత్వం.. గతేడాది జనవరి 16న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దేశ్యాప్తంగా ప్రారంభమైన విషయం తెలిసిందే కగా.. ఈ ఏడాది జనవరి 10వ తేదీ నుంచి యాంటీ-కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులు, ఎన్నికల విధుల్లో ఉన్నవారితో సహా 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కో మార్బిడిటీ గల వ్యక్తులకు బూస్టర్ డోస్ మోతాదులను అందించడం మొదలెట్టింది ప్రభుత్వం..

Exit mobile version