HIV cases: ఉత్తరాఖండ్‌లో హెచ్ఐవీ కేసుల పెరుగుదల కలకలం రేపుతోంది. రాంనగర్‌లో హెచ్ఐవీ కేసులు సంఖ్య హఠాత్తుగా పెరిగింది. దీనిపై అక్కడి ఆరోగ్య అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 19 నుంచి 20 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇది స్థానికంగా ఆరోగ్య శాఖలో హెచ్చరికల్ని పెంచింది. గత కొన్నేళ్లుగా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నప్పటికీ, ఇటీవల కాలంలో ఈ సంఖ్య పెద్ద ఎత్తున నమోదవుతోంది. బాధిత వ్యక్తులంతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు.
Read Also: IPL History: ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా సంపాదించిన ఆటగాళ్లు ఎవరంటే
సాధారణంగా ఏటా దాదాపుగా 20 హెచ్ఐవీ కేసులు నమోదవుతున్నాయి. అయితే, ఈ ఏడాది కేవలం 5 నెలల్లోనే 19 కొత్త కేసులు నమోదయ్యాయని ఉత్తరాఖండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ హరీష్ పంత్ తెలిపారు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. ఈ అంటువ్యాధి ఒక మహిళ పరిచయంతో ఏర్పడుతున్నాయని అనుమానిస్తున్నారు. అయితే, దీనిని స్థానిక ఆరోగ్య శాఖ ఇంకా ధృవీకరించలేదు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.
మాదకద్రవ్యాలకు బానిసైన మహిళ అనేక మంది యువకులకు హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ సోకడానికి కారణమని సోషల్ మీడియాలో చర్చిస్తు్న్నారు. అయితే, ఈ వాదనలపై ఆరోగ్య శాఖ జాగ్రత వహించాలని కోరింది. దర్యాప్తు పూర్తయితేనే కారణం వెలుగులోకి వస్తుందని చెబుతున్నారు. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఆ ప్రాంతంలోని కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.