Live-in relationship: దేశంలోనే తొలిసారిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బీజేపీ నేతృత్వంలోని పుష్కర్ సింగ్ ధామి సర్కార్ ఈ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాజాగా ఈ బిల్లులోని కొన్ని అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా లివ్-ఇన్ రిలేషన్ షిప్‌పై కీలక నియమ నిబంధనలను తీసుకువచ్చింది.
లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తులు తమ రిలేషన్ గురించి జిల్లా అధికారుల ముందు నమోదు చేసుకోవాలని, 21 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారు సహజీవనం చేయాలనుకుంటే తల్లిదండ్రుల సమ్మతి ఖచ్చితంగా అవసరమని యూసీసీ బిల్లులో పొందుపరిచారు. ఇది ఉత్తరాఖండ్ వాసులకు రాష్ట్రం వెలుపల లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న వారికి కూడా వర్తిస్తుంది.
Read Also: Red Sandal Smugglers: రెచ్చిపోయిన ఎర్రచందనం స్మగర్లు.. వాహనంతో ఢీకొట్టి కానిస్టేబుల్ హత్య
నిబంధనలను పాటించడంలో విఫలమైన వారికి 6 నెలల వరకు జైలు శిక్ష, రూ.25000 జరిమానా లేదా రెండూ కూడా ఉంటాయి. డిక్లరేషన్ సమర్పించకుండా ఒక నెల కంటే ఎక్కువ కాలం లివ్ ఇన్‌లో ఉంటే వారికి శిక్ష విధించబడుతుంది. వారికి మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. 10,000 జరిమానా లేదా రెండూ విధించబడుతాయి. తప్పుడు స్టేట్‌మెంట్ ఇస్తే, వారు మూడు నెలల వరకు జైలుశిక్ష మరియు రూ. 25,000 మించకుండా జరిమానా లేదా రెండింటినీ ఎదుర్కొంటారని యూసీసీ బిల్లులో పొందుపరిచారు.
యూసీసీ ప్రకారం.. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో విడిపోయిన మహిళ కోర్టును ఆశ్రయించవచ్చు మరియు మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి అర్హులు. భాగస్వాముల మధ్య నిషేధిత సంబంధం ఉన్నట్లయితే వారి రిలేషన్ నమోదు చేయబడదు. వ్యక్తుల్లో ఒకరు మైనర్ అయినప్పుడు లేదా బలవంతంగా, మోసపూరితంగా లివ్ రిలేషన్ పెట్టుకున్నప్పడు డిక్లరేషన్ ఆమోదించబడదు.
