Flying Car: ఇంజినీరింగ్ డిగ్రీ లేదు..13 ఏళ్ల కష్టంతో ‘‘ఫ్లయింగ్ కార్’’ తయారీ..
- ఇంజనీరింగ్ లేకున్నా, పట్టుదలతో ‘‘ఫ్లయింగ్ కార్’’ తయారీ..
- 13 ఏళ్ల పాటు ఇంటర్నెట్ సాయంతో ఎగిరే వాహనం..
- ఉత్తరాఖండ్‌కు చెందిన రవి తమ్తా రికార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flying Car: ప్రతిభకు చదువుతో సంబంధం లేదని మరోసారి నిరూపితమైంది. ఇంజనీరింగ్ డిగ్రీ లేదు, కేవలం BA చదువుతో ఉత్తరాఖండ్‌కు చెందిన రవి తమ్తా ‘‘ఫ్లయింగ్ కార్’’ను తయారు చేశారు. ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్ ప్రోటో టైప్ తయారు కావడానికి 13 ఏళ్ల కష్టం ఉంది. ఇన్ని సంవత్సరాలు ఆన్లైన్లో నేర్చుకుంటూ, ప్రయోగాలు చేస్తూ చివరకు విజ.యం సాధించారు. అల్మోరా జిల్లాకు చెందిన ఆయన తయారు చేసిన సింగిల్ సీటర్ HAPIDA SKYNeX ఆగస్టులో టెస్ట్ ఫ్లైట్ పూర్తి చేసింది.
ప్రయాణ కష్టాలే స్పూర్తిగా..
బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (BA) డిగ్రీ పొందిన రవి తమ్తాకు అధికారికంగా సైన్స్ లేదా ఇంజినీరింగ్ విద్యలో శిక్షణ లేదు. ఇంటర్నెట్లో లభించిన సమాచారం, నిరంతర ప్రయోగాలు, కుటుంబ సభ్యుల సహకారంతో ఫ్లయింగ్ వెహికల్‌ను అభివృద్ధి చేశారు. ఉత్తరాఖండ్‌లోని జాగేశ్వర్ ధామ్ సమీపంలోని కఫ్లీఖాన్ గ్రామానికి చెందిన రవి తమ్తాకు కొండ ప్రాంతాల్లో ప్రయాణ కష్టాలే ప్రేరణగా నిలిచాయి. ముఖ్యంగా ఆస్పత్రులకు వెళ్లాంటే ఘాట్ రోడ్డులో గంటల కొద్దీ ప్రయాణించాల్సిన పరిస్థితుల్లో రవి ఆలోచనకు బీజం వేసేలా చేశాయి. 2015లో ఫ్లయింగ్ కార్ తయారు చేయాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తన సంస్థ ‘‘హాపిడా స్కై ప్రైవేట్ లిమిటెడ్’’ ద్వారా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు.
Also Read
- Sim binding: ‘‘సిమ్ లేకుంటే వాట్సాప్ పనిచేయదు’’.. జనవరి 1 నుంచి సిమ్ బైండింగ్ స్టార్ట్..
- DK Shivakumar: ‘‘కాంగ్రెస్ వల్లే మోడీ ప్రధాని అయ్యారు’’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు..
- Bihar: తల్లి కోసం కొడుకు సంకల్పం.. పరుగెత్తుకుంటూ 12 జ్యోతిర్లింగాల యాత్ర
- Annamalai: CJPకి ఎప్పటికీ మద్దతు ఇవ్వం, వారి అజెండా వేరు.. అన్నామలై కీలక వ్యాఖ్యలు..
రన్ వే లేకుండా టేకాఫ్ , ల్యాండింగ్..
ఈ ఫ్లయింగ్ కార్ నిలువుగా పైకి ఎగిరి, నిలువుగా కిందకు దిగేలా రూపొందించారు. దీనికి ప్రత్యేకంగా ఎలాంటి రన్ వే అవసరం లేదు. దీంట్లో ఎలక్ట్రిక్ మోటార్లు, ప్రొపెల్లర్లు నింగిలోకి ఎగిరేలా శక్తిని ఇస్తాయి. ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు మల్టీరోలర్ డ్రోన్ల టెక్నాలజీని పోలి ఉంటుంది. తేలికపాటి ఫ్రేమ్, ఒకరే కూర్చునే కాక్‌పిట్, బ్యాటరీతో పనిచేస్తుంది.
ఒక్క ఫ్లయింగ్ కారే కాదు..
రవి తమ్తా కేవలం ఫ్లైయింగ్ కారును మాత్రమే తయారు చేయలేదు. మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేసే షూలు, దృష్టిలోపం ఉన్నవారికి ఉపయోగపడే స్మార్ట్ వాకింగ్ స్టిక్, వెదురును చీల్చే యంత్రం, మొబైల్ ఛార్జింగ్ కోసం ప్రత్యేక కర్ర, అగ్నిమాపక పరికరాలను తయారు చేశారు.
మరిన్ని పరీక్షలు అవసరం..
తక్కువ దూరం దూరాల కోసం, అత్యవసర వైద్య సేవల కోసం ఫ్లయింగ్ కార్‌ను ఉపయోగించాలనేది ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. దీనిని వినియోగించాలనే మరిన్ని సాంకేతిక పరీక్షలు, భద్రతా ధ్రువీకరణలు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుంచి అవసరమైన అనుమతులు పొందాల్సి ఉంది.
తాజావార్తలు
-
Flying Car: ఇంజినీరింగ్ డిగ్రీ లేదు..13 ఏళ్ల కష్టంతో ‘‘ఫ్లయింగ్ కార్’’ తయారీ..
-
Reliance Jio IPO: కోటి దరఖాస్తులతో జియో సరికొత్త చరిత్ర..
-
CM Revanth Reddy : జూలై నాటికి కరువు తీవ్రం.. నష్టపోవద్దంటూ రైతులకు రేవంత్ హెచ్చరిక
-
OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Cyclone Alert : బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం.. ఏపీకి అలర్ట్
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!