Site icon NTV Telugu

Beggar Woman: వామ్మో.. ఆమె దగ్గర అన్ని పైసలా.. నోరెళ్లబెట్టిన జనం..

Untitled Design

Untitled Design

రోడ్డు మీద యాచించే ఓ యాచకురాలి దగ్గర కొన్ని బస్తాల్లో నోట్ల కట్టలు దొరికాయి. ఇదంతా చూసిన స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలతో పాటు ఓ బస్తా నిండా నాణేలు ఉన్నాయి. ఇది చూసిన స్థానికులు ఈమె దగ్గర ఇన్ని పైసలు ఎక్కడియంటూ ఆశ్చర్యయానికి గురవుతున్నారు. బృందం ఆమె వద్దకు వెళ్లి.. సహాయం చేయాలని చూశారు. దీంతో ఆమె వారిని దూరంగా తరమడం ప్రారంభించింది. ముఖ్యంగా తన వద్ద ఉన్న బస్తాలను ఎవరిని ముట్టుకొనియలేదు. దీంతో అనుమానం వచ్చి.. వారంతా కలిసి ఆమె వద్ద ఉన్న సంచులను తనిఖీ చేశారు.

ఆమె సంచిని పూర్తిగా సోదా చేసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె దగ్గర ఉన్న సంచిలో 10, 20, 50, 100, 500 రూపాయల నోట్ల కట్టలు.. అదే విధంగా మరో బస్తాలో పెద్ద మొత్తంలో 1, 2, 5, 10 రూపాయల నాణేలను గుర్తించారు. అధికారులకు సమాచారమిచ్చారు స్థానికులు. అక్కడికి చేరుకున్న అధికారులు ఆమె దగ్గర ఉన్న డబ్బులను లెక్కించడం ప్రారంభించారు. లక్షలాది రూపాయలు ఉండటంతో వారు ఆ డబ్బును లెక్కించి ఆలిసిపోయారే కానీ.. యాచకురాలి వద్ద ఉన్న డబ్బు అయిపోలేదు. దీంతో స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో యాచకురాలి వద్ద కుప్పలు తెప్పలుగా ఉన్న నగదు స్పష్టంగా కనిపించింది.

Exit mobile version