Tractor Carrying 24 Falls Into UP River: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నదిలో పడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని హర్డోయి లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 24 మందితో వెళ్తున్న ట్రాక్టర్ హర్దోయ్ లోని గర్రా నదిలో పడిపోయింది. దీంతో ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న వారంతా నదిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఒకరు మరణించగా.. మరో ఐదుగురు గల్లంతయ్యారు. చనిపోయిన వ్యక్తిని ముఖేష్ గా గుర్తించామని హర్దోయ్ జిల్లా మేజిస్ట్రేట్(డీఎం) అవినాష్ కుమార్ వెల్లడించారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్డీఆర్ఎఫ్), స్థానిక పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మొత్తం ఈ ప్రమాదంలో 14 మందిని రక్షించారు. తప్పిపోయిన ఐదుగురు వ్యక్తుల గురించి గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదంలో నదిలో మునిగిపోయిన ట్రాక్టర్ ను బయటకు తీశారు.
READ ALSO: Donald Trump: ట్రంప్ ఇంట్లో వార్తాపత్రికలు, మ్యాగజైన్ల మధ్య దేశ రహస్య పత్రాలు..
ప్రమాదానికి గురైన వారంత వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారే. బేగ్ రాజ్ పూర్ గ్రామానికి చెందిన రైతులు సమీపంలోని మార్కెట్ లో పంట ఉత్పత్తులను అమ్ముకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ప్రమాణిస్తున్న సమయంలో పల్లి ప్రాంతంలోని గర్రా నది వంతెనపై ట్రాక్టర్ ఒక చక్రం ఊడిపోయింది. దీంతో ట్రాక్టర్ అదుపుతప్పి నదిలో పడింది.
