Uttar Pradesh Street Vendor Charged With 366 Crore GST Fraud: అతను ఫుట్‌పాత్ మీద బట్టలు అమ్ముకునే వ్యక్తి. అతని సంపాదన రోజుకి 500 రూపాయలు మాత్రమే! అలాంటి పేదవాడికి ఒక రోజు జీఎస్టీ ఆఫీస్ నుంచి నోటీసు వచ్చింది. జీఎస్టీ కట్టకుండా, ప్రభుత్వం కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్నందుకు.. రూ. 366 కోట్ల జరిమానా కట్టాలంటూ ఆ నోటీసులో అధికారులు పేర్కొన్నారు. దీంతో.. ఆ పేదవాడి కళ్లు బైర్లు కమ్మాయి. ఒక చిరు వ్యాపారి అయిన తాను.. అంత భారీ మోసం ఎలా చేయగలనంటూ లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Fraud Gang : ఫేక్ బ్యాంక్ గ్యారంటీలతో మోసాలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు
ఆ వ్యక్తి పేరు ఇజాజ్ అహ్మద్. ఆయనకు 40 ఏళ్లు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ వీధుల్లో రోజూ బట్టలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ చిరు వ్యాపారికి రోజుకి వచ్చే ఆదాయం కేవలం రూ.500 మాత్రమే. రెండేళ్ల క్రితం ఇతను అనుకోకుండా జీఎస్టీ అకౌంట్ ఓపెన్ చేశాడు. పాత వస్తువులు సేకరించి, వాటిని అమ్మే దుకాణాన్ని మొదలుపెట్టాడు. అందుకు గాను జీఎస్టీ లైసెన్స్ తీసుకున్నాడు. అయితే.. అందులో అతనికి భారీ నష్టాలు వచ్చాయి. ఆ దెబ్బకు అతను స్క్రాప్ దుకాణాన్ని వేరే వాళ్లకు అమ్మేశాడు. అప్పటినుంచి ముజఫర్ నగర్ వీధుల్లో బట్టలు అమ్ముకుంటున్నాడు. అయితే.. తాను దుకాణం అమ్మేసిన తర్వాత తన అకౌంట్‌ని రద్దు చేయడాన్ని మర్చిపోయాడు. ఇప్పుడు అదే అతని కొంపముంచింది.
Arshdeep Singh: టీ20ల్లో అర్ష్‌దీప్ చెత్త రికార్డ్.. అదే కొంపముంచింది
ఇజాజ్ అహ్మద్ జీఎస్టీ ఫ్రాడ్‌కు పాల్పడ్డాడంటూ అధికారులు ఆరోపిస్తున్నారు. ఆ జీఎస్టీ నెంబర్ నుంచి రూ. 300 కోట్ల బిల్లులు రెడీ అయ్యాయని, దానికి సంబంధించి ఇజాజ్‌కి నోటీసులు ఇచ్చామని అంటున్నారు. అయితే.. ఇజాజ్ అహ్మద్ మాత్రం, రోజుకు కేవలం 500 సంపాదించే తాను అంత పెద్ద మోసం ఎలా చేయగలనంటూ వాపోతున్నాడు. దీంతో.. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. అతను నిజంగానే అమాయకుడా, కాదా అనేది పూర్తిస్థాయి విచారణ తర్వాతే తేలుతుందంటున్నారు. సహచర వ్యాపారులు సైతం.. ఇజాజ్ అంత పెద్ద ఫ్రాడ్ చేసే వ్యక్తి కాదని చెప్తున్నారు.
Vijay: నా కొడుకుతో నాకు విభేదాలు నిజమే.. ఓపెన్ అయిన విజయ్ తండ్రి