Site icon NTV Telugu

Uttar Pradesh: రామ్ జానకీ మందిరానికి బాంబు బెదిరింపులు..

Uttar Pradesh

Uttar Pradesh

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో రామ్ జానకీ ఆదలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆలయాన్ని పేల్చేస్తామని బెదిరిస్తూ ఆలయ గోడలకు, ఆలయంలో పోస్టర్లు వెలిశాయి. ఆలయ ధర్మకర్త బీజేపీ నేత రోహిత్ సాహూకు కూడా ఈ బెదిరింపు లేఖలు వచ్చాయి. అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ట జరిగిన ఆరు రోజుల తర్వాత ఈ లేఖలు రావడం చర్చనీయాంశంగా మారాయి.

Read Also: Breaking News: వచ్చే నెల రెండోవారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!

దీనిపై ఆలయ ధర్మకర్త రోహిత్ సాహు తమ్ముడు రాహుల్ సాహూ మాట్లాడుతూ.. గుడిలో బెదిరింపు పోస్టర్లు వెలిశాయనే విషయం తెలియగానే అక్కడి చేరుకున్నానని, ఆలయంలో చెల్ల చెదురుగా పోస్టర్లు కనిపించాయని, దీంతో తాను భయపడినట్లు తెలిపారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ విషయంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో బెదిరింపు పోస్టర్లు వేయడం గురించి తెలుసుకున్నామని, దీనికి సంబంధించి అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Exit mobile version