Site icon NTV Telugu

Meerut: ఉద్యోగం పేరుతో హోటల్ కు పిలిచి.. అత్యాచారం.. ఆపై బ్లాక్ మెయిల్..

Untitled Design (1)

Untitled Design (1)

ఈ మధ్య జాబ్ ఇస్తామని చెప్పి అత్యాచారాలు చేస్తున్న ఘటనలు చూస్తున్నాం. ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిని వారిని టార్గెట్ చేస్తూ.. ఇలాంటి ఘటనలు జరగుతున్నాయి. తాజాగా యూపీలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది…

పూర్త వివరాల్లోకి వెళితే.. జాబ్ పేరుతో యువతులను టార్గెట్ చేస్తున్న కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారికి వల వేస్తూ.. ఉద్యోగం పేరుతో హోటల్‌కు పిలవడం, ఆ తర్వాత మత్తుమందు ఇచ్చి మోసాలకు పాల్పడటం చూస్తూనే ఉన్నాం. ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ జాబ్ ఇప్పిస్తానని చెప్పి.. ఓ యువతిని హోటల్ కు పిలిచాడు అకీబ్ అనే వ్యక్తి.. అనంతరం ఆమెకు కాఫీ ఆర్డర్ ఇచ్చి.. అందులో మత్తు మందు కలిపాడు. ఆమె స్పృహ కోల్పోవడంతో ఆమెపై అత్యాచారం చేశాడు. యువతి కళ్లు తెరిచేసరికి నగ్నంగా ఉండడంతో.. ఎవరికి చెప్పుకోలేక.. ఏం చేయాలో తెలియక చివరకు బాధతో ఇంటికి వెళ్లింది.
కొన్ని రోజుల తర్వాత అకీబ్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఆమెను అత్యాచారం చేసేటపుడు వీడియో రికార్డ్ చేశాడు. దీంతో ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ.. తనను మళ్లీ హోటల్ రావాలని.. లేకపోతే వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. బాధితురాలు ఇది తట్టుకోలేక అతడిపై కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Exit mobile version