Site icon NTV Telugu

కొండచరియలు విరిగి పడి 52 మంది మృతి


ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇది చాలదన్నట్టు కొండ చరియలు విరిగి పడటంతో చాలా చోట్ల రాకపోకలు బంద్ అయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని కొండచరియలు విరిగిపడి 52మంది మృతి చెందారు. మరో ఐదుగురి ఆచూకి తెలియరాలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. కొండ చరియలు విరిగిపడటంతో రెండు రోజులుగా నైనితాల్‌కు పూర్తిగా రాకపోకలు బంద్‌ అయ్యాయి. కారణంగా గత మూడు రోజుల్లో 8,000మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌ తెలిపారు.

Exit mobile version