USCIRF: భారతదేశంలో మైనారిటీల స్వేచ్ఛపై మరోసారి యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (USCIRF) తప్పుడు ప్రచారం చేసింది. మంగళవారం తన నివేదికలో భారత్, వియత్నాం దేశాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. సిక్కు వేర్పాటువాదుల కుట్రల్లో పాల్గొన్న భారతీయ గూఢచార సంస్థ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్(RAW)పై ఆంక్షలు విధించాలని సూచించింది.
Read Also: Deputy CM Pawan Kalyan: తమ కుటుంబ మూలాలున్న గ్రామాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. రంగంలోకి అధికారులు..!
భారత్‌లో 2024లో మత స్వేచ్ఛ పరిస్థితి మరింత దిగజారిందని USCIRF నివేదించింది. ముస్లింలు, ఇతర మతపరమైన మైనారిటీలపై దాడులు, వివక్ష పెరిగాయని తెలిపింది. భారత ప్రధాని నరేంద్రమోడీ, ఆయన పార్టీ బీజేపీ మస్లింలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాయని ఆరోపించింది. గతేడాది మోడీ మైనారిటీలను చొరబాటుదారులుగా అభివర్ణించినట్లు పేర్కొంది.
మరోవైపు, వియత్నాం ప్రభుత్వంపై కూడా నిందలు మోపింది. మతసంస్థల ఆర్థిక లావాదేవీలపై మరింత నియంత్రణ విధించే ఉత్తర్వులు తీసుకువచ్చినట్లు పేర్కొంది. ఇది మతపరమైన కార్యకలాపాలను నియంత్రించే చర్యగా పేర్కొంది. మత స్వేచ్ఛ కోసం ప్రచారం చేసినందుకు 80 మందికి శిక్షలు విధించిందని తెలిపింది. నిజానికి ఈ నివేదికను అమెరికా ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం లేదు. కానీ, పలు సందర్భాల్లో ఈ సంస్థ భారత వ్యతిరేకత నివేదికలు ఇస్తూనే వస్తోంది. భారత్ కూడా వీటిపై ఘాటుగానే విమర్శించింది.