Love Failure Incident: ఇటీవల ప్రేమ వ్యవహారాలు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ప్రేమ పేరుతో మోసపోయిన యువతీ యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి, వాడుకుని మోసం చేసి వేరే వారిని వివాహం చేసుకుంటున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఇదిలా ఉంటే ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతి మత్తు మందును ఇంజెక్షన్ చేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ నగరంలో చోటు చేసుకుంది.
Read Also: Pervez Musharraf: కార్గిల్ యుద్ధ కారకుడు.. కరడుగట్టిన భారత వ్యతిరేకి.. పాక్ నియంత ముషారఫ్
వివరాల్లోకి వెళితే ఇండోర్ నగరానికి చెందిన 27 ఏళ్ల నర్సు మత్తుమందును ఎక్కువ మోతాదులో ఇంజెక్ట్ చేసుకుని ప్రాణాలు తీసుకుందని పోలీసులు అదివారం తెలిపారు. పూజా గంజన్ అనే యువతి రెండు రోజుల క్రితం తన ఇంట్లో మత్తు మందు మోతాదుకు మించి శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకున్నట్లు ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్ అధికారులు వెల్లడించారు. తన మరణానికి కారణాలను రెండు పేజీల వివరిస్తూ సూసైడ్ నోట్ లో రాసి ఆత్మహత్య చేసుకుంది.
ఆస్పత్రిలో పనిచేస్తున్న తన సహోద్యోగితో సంబంధం ఉందని మృతురాలు లేఖలో పేర్కొంది. అయితే అతడు వేరే ఆస్పత్రిలో ఉద్యోగంలో చేరి మరొక మహిళను వివాహం చేసుకున్నాడని లేఖలో తెలిపింది. మృతురాలి మాజీ ప్రియుడి వాగ్మూలం ప్రకారం..తనకు మహిళతో సంబంధం ఉందని, అయితే తన కుటుంబ సభ్యులు వేరే అమ్మాయితో పెళ్లిని నిశ్చయించడంతో పెళ్లి చేసుకోనని ఆమెకు చెప్పినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.