NTV Telugu Site icon

UPSC Exam: సివిల్స్‌లో “ఇద్దరికి ఒకే ర్యాంక్, ఒకే రోల్ నెంబర్” కేసు.. క్రిమినల్ చర్యలకు సిద్ధం..

Upsc Exam

Upsc Exam

UPSC Exam: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు అమ్మాయిలకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో ‘‘ఒకే ర్యాంక్, ఒకే రోల్ నెంబర్’’ రావడం, చివరకు వారిద్దరి ఫస్ట్ నేమ్ కూడా ఒకటే కావడం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాకు చెంది. అయాషా ఫాతిమా(23), అలీరాజ్ పూర్ జిల్లాకు చెంది అయాషా మక్రానీ(26)లకు ఒకే రోల్ నెంబర్, ఒకే ర్యాంక్ రావడం వివాదాస్పదం అయింది. తమకు 184 ర్యాంక్ వచ్చిందని ఇద్దరు యువతులు క్లెయిమ్ చేసుకున్నారు.

Read Also: Aditi Arya: కళ్యాణ్ రామ్ హీరోయిన్.. మంచి బిలియనీర్‌ని పట్టేసిందే..

అయితే పూర్తిగా అడ్మిట్ కార్డులను పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మక్రానీ కార్డ్ పర్సనాలిటీ టెస్ట్ తేదీని ఏప్రిల్ 25, 2023 గురువారం రోజు పేర్కొనబడింది.. అయితే ఫాతిమా కార్డులో కూడా తేదీని చూపుతుంది, అయితే ఆ రోజు మంగళవారంగా పేర్కొనబడింది. నిజానికి క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 25 మంగళవారం. ఫాతిమా కార్డు క్యూఆర్ కోడ్ కలిగి ఉండటంతో పాటు వాటర్ మార్క్ కలిగి ఉంది. మక్రానీ కార్డు క్యూాఆర్ కోడ్ లేకుండా సాదా కాగితంపై ప్రింట్ అవుట్ తో ఉంది. చివరకు అయాషా ఫాతిమా సరైన అభ్యర్థి అని యూపీఎస్సీ వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉంటే అయాషా మక్రానీపై క్రిమిానల్ చర్యలకు ఉపక్రమించింది ప్రభుత్వం. భారత ప్రభుత్వం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) నోటిఫై చేసిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2022 నిబంధనల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొంది. మోసపూరితంగా ప్రవర్తించినందుకు క్రిమినల్ , క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయింది. ఇదిలా ఉంటే బీహార్ కు చెందిన తుషార్ అనే వ్యక్తి కూడా ఇలాగే తప్పుగా తనకు సివిల్స్ లో ర్యాంక్ వచ్చిందంటూ పేర్కొన్నాడు. ఈ వ్యక్తిపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.