Site icon NTV Telugu

UPSC: యూపీఎస్సీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసిన మనోజ్‌ సోనీ

Upsc

Upsc

UPSC: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) ఛైర్మన్‌ మనోజ్‌ సోనీ ఇవాళ (శనివారం) తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. గత సంవత్సరం ఏప్రిల్‌ నెలలోనే ఆయన బాధ్యతలు చేపట్టగా.. ఇంకా ఐదేళ్ల పదవీకాలం ఉండగానే రిజైన్ చేయడం గమనార్హం. అయితే, మనోజ్ సోనీ రాజీనామాను ఇంకా ఆమోదించలేదని అధికారిక వర్గాలు తెలిపాయి.

Read Also: Romance With Statue: ఇదేం కర్మరా బాబు.. పబ్లిక్ లో విగ్రహం ప్రైవేట్ పార్టుతో రొమాన్స్ చేసిన మహిళ..

అయితే, యూపీఎస్సీ చైర్‌పర్సన్ మనోజ్ సోనీ 2029లో పదవీకాలం ముగియడానికి దాదాపు 5 సంవత్సరాలు ఉంది. గత నెల రోజుల క్రితమే రాజీనామా చేశారని, అయితే అది ఆమోదం పొందుతుందా లేదా అనే విషయంపై ఏమీ చెప్పలేమని అధికారిక వర్గాలు చెప్పాయి. 2017లో యూపీఎస్సీలో సభ్యునిగా చేరారు.. అయన మే 16, 2023న చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. మనోజ్ సోనీ ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు. 2005లో వడోదరలోని ప్రసిద్ధ ఎంఎస్ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్‌గా ప్రధాని మోడీ ఆయనను ఎన్నుకున్నారు. 40 ఏళ్ల వయసులో దేశంలోనే అతి పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్‌గా మనోజ్ సోనీ నిలిచారు.

Exit mobile version