Site icon NTV Telugu

UPI Outage:: దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు అంతరాయం, అనేక బ్యాంక్ సర్వర్లు డౌన్..?

Upi

Upi

UPI Outage: దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ విఫలమవుతున్నాయి. మంగళవారం దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది. పలువురు నెటిజన్లు ఎక్స్(ట్విట్టర్)వేదికగా అంతరాయం గురించి ట్వీట్స్ చేశారు. తాము ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)తో పాటు బ్యాంకింగ్ రంగం దేశవ్యాప్తంగా అంతరాయాన్ని ఎదుర్కొంది. దీంతో ఈ రోజు సాయంత్రం డిజిటల్ చెల్లింపుల్లో అవాంతరాలు ఎదురయ్యాయి.

Read Also: Imran Khan: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి ఉరిశిక్ష తప్పదా.? పాక్ ఆర్మీ చట్టాలు ఏం చెబుతున్నాయి.?

గూగల్ పే, ఫోన్ పే, భీమ్ మొదలైన యూపీఐ యాప్స్ ద్వారా చెల్లింపుల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. HDFC బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), కోటక్ మహీంద్రా బ్యాంక్‌తో సహా ఇతర అనేక బ్యాంకులు సర్వర్లు సమస్యల్ని ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో యూపీఐ లావాదేవీలపై ప్రభావం పడింది. భారతదేశంలో రిటైల్ చెల్లింపులు మరియు సెటిల్‌మెంట్ సిస్టమ్‌లను నిర్వహించే NPIC (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) యొక్క అధికారిక వెబ్‌సైట్ కూడా డౌన్‌లో ఉందని వినియోగదారులు ట్వీట్స్ చేస్తున్నారు.


https://twitter.com/iamujjwaal/status/1754819059567206892

Exit mobile version