UPI Payments: భారత దేశంలో 85 శాతానికి పైగా డిజిటల్ చెల్లింపులు యూపీఐ ద్వారానే డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. UPI దేశ డిజిటల్ ఎకానమీలో పెను విప్లవమని వరల్డ్ బ్యాంక్, IMF సమావేశాల్లో ఆయన తెలిపారు. ప్రతి నెలా 20 బిలియన్లకు పైగా ట్రాన్సాక్షన్లు జరుగుతున్నట్లు వెల్లడించారు. యూపీఐ కేవలం ఆర్థిక సాధనం మాత్రమే కాదు.. సామాజిక, ఆర్థిక సమానత్వానికి సూచిక అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. యూపీఐ పరిధి దేశాలు దాటిందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పుకొచ్చారు.
Read Also: Plane Crash: హాంకాంగ్‌లో కూలిన విమానం.. ఇద్దరు మృతి.!
ఇక, ఇండియాలో డిజిటల్ చెల్లింపు లావాదేవీలు UPI ద్వారానే కొనసాగుతున్నాయి. యూపీఐ సురక్షితంగా, స్కేలబుల్ గా ఉండే డిజిటల్ పబ్లిక్ ప్లాట్ఫామ్ (DPPలు) విషయంలో దేశం ఒక కేస్ స్టడీగా మారగలదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. కలుపుకొని వృద్ధి, ఆవిష్కరణలకు DPPలు శక్తివంతమైన ఉత్ప్రేరకంగా మారాయని వెల్లడించారు. త్వరలోనే క్యాష్ లెస్ చెల్లింపులు తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
