UP Video: దు:ఖసాగరంగా మారిన ఎస్పీ బదిలీ.. వీడ్కోలు సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన పోలీసులు
- దు:ఖసాగరంగా మారిన ఎస్పీ బదిలీ
- వీడ్కోలు సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన పోలీసులు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్కూల్ టీచర్లు బదిలీ అయినప్పుడు విద్యార్థులు కన్నీటి పర్యంతం అయిన సంఘటనలు మీడియాలో చాలా చూశాం. కానీ విచిత్రంగా పోలీస్ శాఖలో ఒక ఐపీఎస్ అధికారి బదిలీ.. పోలీసులకు కంటతడి తెప్పించింది. వీడ్కోలు సమయంలో పోలీసులందరూ వెక్కి వెక్కి ఏడ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏ శాఖలోనైనా స్ట్రిట్ ఆఫీసర్ ఉంటే ఎప్పుడు వెళ్లిపోతాడా? అంటూ శాపనార్థాలు పెడుతుంటారు. త్వరగా ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ఒక ఎస్పీ బదిలీ సమయంలో పోలీసులంతా కంటతడి పెట్టారు. ఎందుకు ఇంతగా ఎమోషనల్ అయ్యారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
ఐపీఎస్ విద్యాసాగర్ మిశ్రా ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో అత్యంత చురుకైన అధికారుల్లో ఒకరు. ఆయన ప్రవర్తన గురించి గానీ.. పోలీసింగ్ తీరు గురించి గానీ ప్రత్యేకంగా చర్చించుకుంటారు. అంత పాఫులర్. తాజాగా రాంపూర్ పోలీస్ శాఖలో భారీ బదిలీలు జరిగాయి. ఈ బదిలీల్లో విద్యాసాగర్ మిశ్రా కూడా ఉన్నారు. 2017 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సోమేంద్ర మీనా కొత్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా నియమితులయ్యారు. అదే సమయంలో ఎస్పీ విద్యాసాగర్ మిశ్రా 11వ పీఏసీ బెటాలియన్ కమాండర్‌గా సీతాపూర్‌కు బదిలీ అయ్యారు.
విద్యాసాగర్ మిశ్రా బదిలీ కావడంతో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంపూర్‌లో ఉన్న పోలీసులంతా వీడ్కోలు చెబుతుండగా ఒక్కసారిగా వాతావరణం దు:ఖ సాగరంగా మారిపోయింది. మహిళా పోలీసులంతా కన్నీటి పర్యంతం అయ్యారు. పోలీసులందరూ వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో ఆయన ఏడ్వొద్దు అంటూ శాంతింపజేశారు. అయినా కూడా ఏడుస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హైలెట్‌గా నిలిచాయి.
ఐపీఎస్ విద్యా సాగర్ మిశ్రా ఎవరు?
అసలు ఐపీఎస్ విద్యాసాగర్ మిశ్రా ఎవరు?. వీడ్కోలు సమయంలో పోలీసులు అంతగా ఎందుకు ఏడ్చారు. పోలీస్ శాఖపై ఆయన చూపించిన ప్రభావం ఎంత? వివరాలు తెలుసుకుందాం.
ఉత్తర ప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన విద్యా సాగర్ మిశ్రా తండ్రి కోల్‌కతా పోలీసులో కానిస్టేబుల్‌గా పనిచేశారు. విద్యా సాగర్ మిశ్రా ప్రభుత్వ పాఠశాలలో విద్యను పూర్తి చేశారు. బాన్స్తేలోని అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువును ప్రారంభించి… అనంతరం తన తండ్రితో కలిసి కోల్‌కతాకు వెళ్లారు. అక్కడ 8వ తరగతి చదువును పూర్తి చేశారు. 1983లో వెస్ట్ బెంగాల్ బోర్డ్ నుంచి 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత కోల్‌కతా విశ్వవిద్యాలయం పరిధిలోని సిటీ కాలేజీలో చేరి బీఎస్సీ పట్టా పొందారు.
తండ్రిని యూనిఫాంలో చూసి విద్యాసాగర్ మిశ్రాకు కూడా పోలీసు వృత్తిపై మమకారం పెంచుకున్నారు. అప్పుడే ఐపీఎస్ అధికారి కావాలని నిర్ణయించుకున్నారు. కోల్‌కతా విడిచిపెట్టిన తర్వాత అలహాబాద్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించారు. ఆ తర్వాత రెండు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా.. తన కలను నెరవేర్చుకోవడానికి వాటిని తిరస్కరించారు. 1993లో పీపీఎస్‌కు ఎంపికై.. తదనంతరం 2015లో ఐపీఎస్‌కు పదోన్నతి పొందారు. పోలీసు అధికారి అయిన తర్వాత.. ఉత్తర ప్రదేశ్‌లోని అనేక ప్రధాన జిల్లాల్లో పనిచేసి అత్యద్భుతంగా రాణించారు. మంచి గుర్తుంపు కూడా తెచ్చుకున్నారు.
రాజీపడని అధికారులు
యూపీ పోలీస్ దళంలో ఏ విషయంలోనూ రాజీపడని అధికారుల్లో ఐపీఎస్ విద్యాసాగర్ మిశ్రా ఒకరుగా పేరు గాంచారు. ఈనాటికీ ఆయన పేరు వినగానే నేరగాళ్లు వణికిపోతారని చెప్పుకుంటారు. ఆయన పేరిట 45కు పైగా ఎన్కౌంటర్లు ఉన్నాయి. ఇక తన సహోద్యోగులతోనూ… ప్రజలతో ఎంతో నిరాడంబరంగా ఉంటారు. తన జూనియర్ అధికారులను.. పోలీసులను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతుంటారు. అందుకే ఆయన బదిలీ సందర్భంగా అందరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
"Bheegi palkein", "Kabhi Alvida na kahana" playing in the background
Scene from UP during farewell of IPS Vidyasagar Mishra, SP Rampur, who was transferred out in a recent reshuffle. pic.twitter.com/8ooesp6slt
— Piyush Rai (@Benarasiyaa) April 2, 2026
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!