ఉత్తర ప్రదేశ్‌లో రాబోయే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లోని తృణముల్ కాంగ్రెస్ అనుసరించిన వ్యూహాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. టీఎంసీ గత ఎన్నికల్లో 40శాతం సీట్లను మహిళలకు కేటాయించి ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఇప్పటికే దీని పై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్న ప్రియాంక గాంధీ క్లారీటీ ఇచ్చారు.
ఉత్తర ప్రదేశ్ పార్టీ వ్యవహరాలను ప్రియాంక గాంధీకి అప్పగించాలని అధిష్టానం యోచిస్తోంది.40 శాతం సీట్లను మహిళలకు కేటాయించేలా ఆమె అధిష్టానాన్ని ఒప్పించనున్నారు. ఏ పార్టీలో పూర్తి స్థాయిలో మహిళల ఆధిపత్యం లేదని ఆమె తెలిపారు. మహిళలకు పూర్తి స్థాయిలో అధికారం కల్పించేందుకు ఇదే సరైన సమయమని ఆమె భావిస్తున్నారు.
తృణముల్ కాంగ్రెస్, మమతబెనర్జీ నాయకత్వంలో40 శాతం సీట్లను ఎన్నికల్లో మహిళలకు కేటాయించిన మొదటి పార్టీగా రికార్డు సృష్టించింది.