Site icon NTV Telugu

Uttar Pradesh: ఎనర్జీ పిల్ వేసుకుని అఘాయిత్యం… ఆ తర్వాత ఏమైంది?

Uttar Pradesh Incident

Uttar Pradesh Incident

UP College Student Dies After physical assault, Accused Says He Took Energy Pill: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. కాలేజీ విద్యార్థినిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో యువతి మరణించింది. అయితే పోలీస్ విచారణలో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ ఉన్నావ్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడు కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఇంట్లో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో రాజ్ గౌతమ్ అనే యువకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Read Also: Shoaib Akhtar: మహ్మద్ షమీ “కర్మ” ట్వీట్ కు షోయబ్ అక్తర్ రిప్లై ఇదే..

ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీస్ విచారణ షాకింగ్ విషయాలు వెల్లడించాడు నిందితుడు. ఎనర్జీ పిల్స్ వేసుకుని అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు. బాధితురాలు ఎంతగా పెనుగులాడినా వినకుండా ఆమె స్పృహ కోల్పోయే దాకా అత్యాచారం చేశాడు. దీంతో ఆమె ప్రైవేటు భాగాల్లో తీవ్రంగా రక్తస్రావం అయింది. దీన్ని గమనించిన నిందితుడు భయంతో అక్కడి నుంచి పారిపోయాడు.

ఈ ఘటన జరిగిన తర్వాత ఇంటికి వచ్చిన బాధితురాలి చెల్లెలు మంచంపై అపస్మారకస్థితిలో పడి ఉన్న బాధితురాలిని చూసింది. వెంటనే ఆస్పత్రికి తరలించినా..లాభం లేకుండా పోయింది. తీవ్ర రక్తస్రావం వల్ల బాధిత యువతి మరణించింది. పోస్టుమార్టం నివేదికలో అత్యాచారం జరిగినట్లుగా తేలింది. బాధితురాలి తండ్రి ముందుగా ఈ ఘటనలో పొరుగున ఉండే 65 ఏళ్ల మహిళ ప్రమేయం ఉందని ఆరోపించాడు. అయితే బాధితురాలి మొబైల్ ఫోన్ డేటా ఆధారంగా పోలీసులు గౌతమ్ ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఒంటరిగా ఉందని తెలిసి ఆమెపై అత్యాచారం చేశానని.. ఆమె ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం అయిందని గౌతమ్ ఒప్పుకున్నాడని.. ఎస్పీ సిద్దార్థ్ శంకర్ వెల్లడించారు.

Exit mobile version