NTV Telugu Site icon

Halal: హలాల్ ఉత్పత్తులపై ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ నిషేధం..

Halal

Halal

Halal: హలాల్ ట్యాగ్ కలిగిన ఉత్పత్తులను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు నిషేధించింది. ప్రజారోగ్యం దృష్ట్యా హలాల్ సర్టిఫైడ్ వస్తువుల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, అమ్మకాలను తక్షణమే నిషేధిస్తున్నట్లు తన యూపీ ఫుడ్ కమిషనర్ కార్యాలయం ఈ రోజు ఉత్తర్వులను జారీ చేసింది. ఆహార ఉత్పత్తుల హలాల్ ధృవీకరణ అనేది ఒక సమాంతర వ్యవస్థ, ఇది ఆహార పదార్థాల నాణ్యతకు సంబంధించిన గందరగోళాన్ని సృష్టిస్తుందని, ఇది చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ఆమోదయోగ్యం కాదని ఆర్డర్ పేర్కొంది.

అంతకుముందు నకిలీ హలాల్ సర్టిఫికేషన్‌ల ద్వారా అమ్మకాలను పెంచుకోవడానికి ప్రజల మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నారని ప్రభుత్వం కొన్ని సంస్థలపై కేసులు నమోదు చేసింది. ఈ చర్యలు తీసుకున్న కొన్ని గంటల్లోనే హలాల్ ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించింది.

Read Also: Question Hour with Raghunandan Rao Exclusive LIVE : ఎన్టీవీ క్వశ్చన్ అవర్ విత్ రఘునందన్ రావు

నకిలీ హలాల్ సర్టిఫికేట్లు అందించడం ద్వారా అమ్మకాలు పెంచుకోవడానికి, మతపరమైన మనోభావాలను ఉపయోగించుకున్నందుకు హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై, జమియత్ ఉలామా-ఇ-హింద్ హలాల్ ట్రస్ట్-ఢిల్లీ, హలాల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా-ముంబై, జమియత్ ఉలామా మహారాష్ట్ర తదితర సంస్థలపై యూపీ పోలీసులు కేసుల్ని నమోదు చేశారు. నిర్దిష్ట మతానికి చెందిన వినియోగదారుల్ని టార్గెట్ చేసుకుని అమ్మకాలు పెంచుకునేందుకు హలాల్ సర్టిఫికేషన్ వాడుతున్నట్లు యూపీ గవర్నమెంట్ పేర్కొంది. ఈ కంపెనీలు ఆర్థిక ప్రయోజనాల కోసం వివిధ కంపెనీలకు నకిలీ హలాల్ సర్టిఫికేట్‌లను జారీ చేశాయని, సామాజిక విద్వేషాన్ని పెంచడమే కాకుండా ప్రజల నమ్మకాన్ని కూడా ఉల్లంఘిస్తున్నాయని ఆ ప్రకటన పేర్కొంది.