Student Protests: వరసగా దేశంలోని పలు యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆందోళనలకు దిగుతున్నారు. ముఖ్యంగా పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(LPU)లో విద్యార్థులు విధ్వంసం సృష్టించారు. దీనికి ముందు పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలోని చాట్కారా యూనివర్సిటీలో కూడా విద్యార్థులు తీవ్ర హింసకు తెగబడ్డారు. చాలా మంది విద్యార్థులకు తాము ఏ విషయమై నిరసన తెలుపుతున్నామో తెలియని పరిస్థితి ఉంది. నిజానిజాలు తెలుసుకోకుండా పోలీస్ వాహనాలను, యూనివర్సిటీ ఆస్తులకు నిప్పు పెట్టారు.
విద్యార్థినిపై అత్యాచారం వదంతులతో LPUలో సెప్టెంబర్27న రచ్చ జరిగింది. యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్‌లో అమ్మాయిపై అత్యాచారం జరిగిందే పుకారుతో విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. ఢిల్లీ-జలంధర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. చివరకు పోలీసులు వాహనాలను కూడా విద్యార్థులు నిప్పు పెట్టారు. చివరకు ఆప్ సర్కార్ సిట్ ఏర్పాటు చేసి విచారణ మొదలుపెట్టింది. విచారణలో ఏ అమ్మాయిపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లభించలేదు.
ఇక చిట్కారా యూనివర్సిటీలో కూడా సెప్టెంబర్ 25న పుకార్లతో అట్టుడికింది. హాస్టల్ గదిలో ఒక అమ్మాయి చనిపోయిందని, ఆమె దెయ్యంగా మారిందని పుకార్లు రావడం, ఇవి సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడంతో విద్యార్థులు తీవ్ర హింసకు పాల్పడ్డారు. పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేశారు.
ఇక పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో సత్య జిత్ రే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో అఖిలభారతీయ గ్రాహక్ పంచాయత్ అనే సంస్థ సదస్సు నిర్వహిస్తున్న సమయంలో ఎన్ఎస్‌యూఐ, ఎస్ఎఫ్ఐ వంటి విద్యార్థి సంఘాలు దాడికి పాల్పడ్డాయి. పాండిచ్చేరి యూనివర్సిటీ ఉపా చట్టంలో జైలులో ఉన్న ఉమర్ ఖలీద్ డాక్యుమెంటరీ ప్రదర్శనపై ఉద్రిక్తత ఏర్పడింది. వామపక్ష సంఘాలు ఉమర్ ఖలీద్‌కు మద్దతు తెలపడంపై ఏబీవీపీ అభ్యంతరం తెలపడంతో ఘర్షణ చోటుచేసుకుంది.
పక్కా ప్రణాళిక ద్వారే జరుగుతున్నాయా??
LPU, చిట్కారా ఘటనల్లో విద్యార్థుల ఉద్రిక్తతల్ని కావాలనే కొందరు పెంచినట్లు తెలుస్తోంది. LPUలో జరిగిన హింసలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి యూనివర్సిటీలో ఎలాంటి సంబంధం లేదు. వీరి వద్ద నుంచి కత్తుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కావాలనే హింసను పెంచడానికి కొందరు ప్రయత్నిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. తమ రాజకీయ లాభాల కోసం కొందరు విద్యార్థుల్ని పావులుగా వాడుకుంటున్నారనేది స్పష్టమవుతోంది.

