Site icon NTV Telugu

Professor Bikini: బికినీ ధరించింది.. ఉద్యోగం ఊడింది.. ఆపై రూ. 99 కోట్లు..

Professor Bikini Picts

Professor Bikini Picts

University Professor Forced To Quit Job For Bikini Pictures: బికినీ ధరించిన పాపానికి ఓ మహిళా ప్రొఫెసర్‌ ఉద్యోగం ఊడింది. అంతేకాదు.. ఆమెపై రూ. 99 కోట్ల జరిమానా కూడా విధించారు. గతేడాదిలో కోల్‌కతాలో చోటు చేసుకున్న ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ సెయింట్ జేవియర్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళ, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బికినీలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. వాటిని అదే యూనివర్సిటీలో చదువుతోన్న 18 ఏళ్ల స్టూడెంట్ చూశాడు. అది గమనించిన అతడి తండ్రి, వెంటనే యూనివర్సిటీకి ఆ ప్రొఫెసర్‌పై ఫిర్యాదు చేశాడు.

‘‘ప్రొఫెసర్‌కు సంబంధించిన కొన్ని బికినీ ఫోటోలను నా కుమారుడు చూడటాన్ని నేను గమనించాను. ఆ ఫోటోలను చూసి నేను నిర్ఘాంతపోయాను. ఒక ప్రొఫెసర్ ఇలా లోదుస్తులు ధరించిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం నిజంగా అవమానకరం. ఇలా ఫోటోలు షేర్ చేస్తూ.. ఆమె తన విద్యార్థులకు ఏం బోధిస్తోంది? ఇది అసభ్యకరమైన చర్య’ అంటూ ఆ స్టూడెంట్ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో.. ఆ యూనివర్సిటీ సదరు ప్రొఫెసర్‌పై సీరియస్ అయ్యింది. వెంటనే ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించింది. అంతేకాదు.. యూనివర్సిటీకి కోలుకోలేని నష్టం కలిగించినందుకు క్షమాపణ చెప్పాలని, రూ. 99 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని నోటీసులు పంపింది.

అయితే.. తానేం తప్పు చేయలేదని, దీనిపై న్యాయ పోరాటం చేస్తానని ఆ ప్రొఫెసర్ చెప్తోంది. యూనివర్సిటీ ప్రాంగణంలో డ్రెస్ కోడ్‌కి సంబంధించి తానెలాంటి ఉల్లంఘనకు పాల్పడలేదంది. తన ఇన్‌స్టా ప్రొఫైల్ కూడా ప్రైవేట్ ఖాతాయేనని తెలిపింది. అనవసరంగా తనని ఉద్యోగంలో నుంచి తొలగించారని, తనకు పంపిన నోటీసులపై తాను హైకోర్టుని ఆశ్రయించానని ఆ ప్రొఫెసర్ పేర్కొంది. తన ఇన్‌స్టా ఖాతాను ఎవరో హ్యాక్ చేసి, ఆ ఫోటోల్ని లీక్ చేశారని ఆ నెలలోనే తాను పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పెద్ద పెద్ద విద్యాసంస్థలు తమ ఉద్యోగుల పట్ల ఇలా వ్యవహరించడం శోచనీయమని ఆ ప్రొఫెసర్ చెప్పుకొచ్చింది.

Exit mobile version