Professor Bikini: బికినీ ధరించింది.. ఉద్యోగం ఊడింది.. ఆపై రూ. 99 కోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
University Professor Forced To Quit Job For Bikini Pictures: బికినీ ధరించిన పాపానికి ఓ మహిళా ప్రొఫెసర్ ఉద్యోగం ఊడింది. అంతేకాదు.. ఆమెపై రూ. 99 కోట్ల జరిమానా కూడా విధించారు. గతేడాదిలో కోల్‌కతాలో చోటు చేసుకున్న ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ సెయింట్ జేవియర్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళ, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బికినీలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. వాటిని అదే యూనివర్సిటీలో చదువుతోన్న 18 ఏళ్ల స్టూడెంట్ చూశాడు. అది గమనించిన అతడి తండ్రి, వెంటనే యూనివర్సిటీకి ఆ ప్రొఫెసర్‌పై ఫిర్యాదు చేశాడు.
‘‘ప్రొఫెసర్‌కు సంబంధించిన కొన్ని బికినీ ఫోటోలను నా కుమారుడు చూడటాన్ని నేను గమనించాను. ఆ ఫోటోలను చూసి నేను నిర్ఘాంతపోయాను. ఒక ప్రొఫెసర్ ఇలా లోదుస్తులు ధరించిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం నిజంగా అవమానకరం. ఇలా ఫోటోలు షేర్ చేస్తూ.. ఆమె తన విద్యార్థులకు ఏం బోధిస్తోంది? ఇది అసభ్యకరమైన చర్య’ అంటూ ఆ స్టూడెంట్ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో.. ఆ యూనివర్సిటీ సదరు ప్రొఫెసర్‌పై సీరియస్ అయ్యింది. వెంటనే ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించింది. అంతేకాదు.. యూనివర్సిటీకి కోలుకోలేని నష్టం కలిగించినందుకు క్షమాపణ చెప్పాలని, రూ. 99 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని నోటీసులు పంపింది.
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
అయితే.. తానేం తప్పు చేయలేదని, దీనిపై న్యాయ పోరాటం చేస్తానని ఆ ప్రొఫెసర్ చెప్తోంది. యూనివర్సిటీ ప్రాంగణంలో డ్రెస్ కోడ్‌కి సంబంధించి తానెలాంటి ఉల్లంఘనకు పాల్పడలేదంది. తన ఇన్‌స్టా ప్రొఫైల్ కూడా ప్రైవేట్ ఖాతాయేనని తెలిపింది. అనవసరంగా తనని ఉద్యోగంలో నుంచి తొలగించారని, తనకు పంపిన నోటీసులపై తాను హైకోర్టుని ఆశ్రయించానని ఆ ప్రొఫెసర్ పేర్కొంది. తన ఇన్‌స్టా ఖాతాను ఎవరో హ్యాక్ చేసి, ఆ ఫోటోల్ని లీక్ చేశారని ఆ నెలలోనే తాను పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పెద్ద పెద్ద విద్యాసంస్థలు తమ ఉద్యోగుల పట్ల ఇలా వ్యవహరించడం శోచనీయమని ఆ ప్రొఫెసర్ చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!