NTV Telugu Site icon

Rammohan Naidu: యుద్ధ విమానంలో ప్రయాణించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Rammohan Naidu

Rammohan Naidu

యంగ్ లీడర్, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు యుద్ధ విమానంలో ప్రయాణించారు. యుద్ధ విమానం నుంచి మంత్రి రామ్మోహన్ నాయుడు విజయ సంకేతం చూపిస్తూ గాల్లో దూసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. బెంగళూరులో ప్రతిష్టాత్మకమైన ఏరో ఇండియా 2025 ప్రదర్శనలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ జేటీ-36 యశస్ యుద్ధ విమానంలో రామ్మోహన్ నాయుడు ప్రయాణించారు. పీఎం మోడీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తికి నిర్వచనంగా హెచ్ఏఎల్, విమానయాన శాఖ నిలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే అత్యాధునిక యుద్ధ విమానాలు తయారు చేయడం అభినందనీయమని అన్నారు.

Also Read:Blockbuster Love Tsunami : పెళ్లి తర్వాత కలిసి “తండేల్” ఈవెంట్‌కి హాజరైన నాగ చైతన్య, శోభిత..

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. యుద్ధ విమానాన్ని నడపడం మరచిపోలేని అనుభూతినిచ్చిందని తెలిపారు. హెచ్ఏఎల్ తయారు చేసిన హెచ్ జేటీ-36 ‘యశస్’ అనే జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం లభించిందన్నారు. విమానయాన, రక్షణ తయారీలో రోజురోజుకూ పెరుగుతున్న పరాక్రమానికి ఈ స్వదేశీ అద్భుతం నిదర్శనమని పేర్కొన్నారు. పీఎం మోడీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.