NTV Telugu Site icon

మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్… 

ఇండియాలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  కరోనా మహమ్మారికి వారు వీరు అనే తేడా లేదు.  ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో వారికి కరోనా సోకుతున్నది.  సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవర్ని కరోనా వదలడం లేదు.  అనేక రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.  మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం కరోనా బారిన పడ్డారు.  ఇటీవలే కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కరోనా బారిన పడ్డారు.  ఇక ఇదిలా ఉంటె, ఈరోజు మరో కేంద్ర మంత్రికి కరోనా సోకింది.  కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కరోనా బారిన పడ్డారు.  ఈ విషయాన్ని అయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.  తనకు టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగిందని, ప్రోటోకాల్ ప్రకారం తనను కలిసిన వ్యక్తులు టెస్టులు చేయించుకొని జాగ్రత్తగా ఉండాలని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.