Site icon NTV Telugu

Ajay Mishra: ప్రపంచం మొత్తం భారత రక్షణ వ్యవస్థ పనితీరును ప్రశంసిస్తోంది.

Ajay Mishra

Ajay Mishra

union minister Ajay mishra on RAF: ప్రపంచంలోని ఏ దేశానికి కూడా మన దేశం నుంచి ముప్పు లేదని.. ఇప్పడు ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందని అన్నారు కేంద్రమంత్రి అజయ్ మిశ్రా. ఆర్ఏఎప్ 30వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో కొనసాగుతున్న అభివృద్ధిపై అందరి దృష్టి ఉందని ఆయన అన్నారు. ఆర్ఏఎఫ్ లాంటి బలగాలు అందిస్తున్న సేవలు, ప్రదర్శిస్తున్న ధైర్యం సాహసాలు అమోఘం అని.. బలగాలకు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడు వెన్నంటే ఉంటుందని అన్నారు. ఆర్ఏఎఫ్ ఇబ్బందులు, సమస్యలను ఆర్ఏఎఫ్ డీజి నుండి అడిగి తెలుసుకున్నాని..దేశంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యం అని.. ఇందులో భాగంగా బలగాలు ఎంతో శ్రమిస్తున్నాయని.. బలగాలు అందిస్తున్న సేవలను దేశ ప్రజలు మరిచిపోరని అన్నారు.

Read Also: Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో హైదరాబాద్‌తో పాటు 35 చోట్ల ఈడీ దాడులు

కేంద్ర బలగాలు ఎలాంటి కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారో ప్రధానమంత్రి దృష్టిలో ఉంది.. దీని పై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూనే ఉన్నారని తెలిపారు. దేశం ముందడుగు వేయడానికి కేంద్ర బలగాలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పొగిడారు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్పీఎఫ్ చూపించే పరాక్రమం దేశం మొత్తం చూస్తోందని.. ఎలాంటి పరిస్థితుల్లో అయిన పోరాడటానికి సిద్ధంగా ఉంటారని ఆయన అజయ్ మిశ్రా అన్నారు.

దేశంలో అంతర్గత భద్రత విషయంలో సీఆర్పీఎఫ్ చరుకుగా పనిచేస్తోందని..ప్రకృతి విపత్తులు, ఉగ్ర దాడులు, అగ్ని ప్రమాదాలు, విష వాయుల దాడులు,ప్రమాదాలు, ఇతర అపత్కాల సమయం లో ప్రాణాలకు తెగించి రక్షణ కల్పిస్తారని అన్నారు. ప్రపంచం మొత్తం భారత రక్షణ వ్యవస్థ పనితీరును ప్రశంసిస్తోందని అన్నారు. ప్రధాన మోదీ విజన్ వల్ల భారత్ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉందని.. రక్షణ వ్యవస్థ లోపాల వల్ల ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లడం చూశామని.. జమ్మూ కాశ్మీర్ బారాముల్లా, బీజాపూర్ ప్రాంతాల్లో బలగాలు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాయని అన్నారు.

Exit mobile version