NTV Telugu Site icon

Union Budget 2025-26 LIVE UPDATES: బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్.. లైవ్ అప్ డేట్స్..

Nirmala

Nirmala

Union Budget 2025 LIVE UPDATE: లోక్ సభలో కేంద్ర బడ్జెట్‌ 2025-26ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. ఎన్టీవీని లైవ్ అప్ డేట్స్ మీకోసం..

The liveblog has ended.
  • 01 Feb 2025 12:32 PM (IST)

    కొత్త పన్ను శ్లాబులు ఇవే..

    కొత్త పన్ను శ్లాబులు సవరణ..

    రూ.0-4 లక్షలు - సున్నా
    రూ.4-8 లక్షలు - 5 శాతం
    రూ.8-12 లక్షలు - 10 శాతం
    రూ.12-16 లక్షలు - 15 శాతం
    రూ.16-20 లక్షలు - 20 శాతం
    రూ.20-24 లక్షలు - 25 శాతం
    రూ.24 లక్షల పైన 30 శాతం

  • 01 Feb 2025 12:19 PM (IST)

    లోక్ సభ వాయిదా..

    సోమవారానికి వాయిదా పడిన లోక్ సభ..

  • 01 Feb 2025 12:15 PM (IST)

    రూ. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు..

    మధ్య తరగతి ప్రజలకు బిగ్ రిలీఫ్.. రూ. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు.. స్టాండర్డ్‌ డిడక్షన్‌తో కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు పన్ను సున్నా

  • 01 Feb 2025 12:09 PM (IST)

    82 అంశాలపై సోషల్ వెల్ఫేర్ సర్ ఛార్జ్ ఎత్తివేత..

    సెస్‌లు పడే 82 టారిఫ్‌ లైన్లపై సామాజిక సంక్షేమ సర్‌ఛార్జ్‌ ఎత్తివేత.. కోబాల్ట్‌ ఉత్పత్తులు, ఎల్‌ఈడీ, జింక్‌, లిథియం అయాన్‌ బ్యాటరీ తుక్కు సహా 12 క్రిటికల్‌ మినరల్స్‌కు కస్టమ్స్‌ సుంకం తొలగిస్తున్నట్లు వెల్లడి..

  • 01 Feb 2025 12:07 PM (IST)

    వృద్ధులకు టీడీఎస్‌ బిగ్ రిలీఫ్

    సీనియర్‌ సిటిజన్స్‌కు TDS మినహాయింపు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంపు.. అప్‌డేటెడ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నమోదుకు సమయం 4 ఏళ్లకు పొడిగింపు-నిర్మలా సీతారామన్‌

  • 01 Feb 2025 12:05 PM (IST)

    కొత్త గమ్యాలకు విమాన సర్వీసులు..

    120 కొత్త గమ్యాలకు ఇక విమాన సర్వీసులు.. 2025-26లో ఫిస్కల్ లోటు అంచనా 4.4 శాతం..

  • 01 Feb 2025 12:04 PM (IST)

    బిహార్ కు వరాల జల్లు..

    త్వరలో ఎన్నికలు జరగనున్న బిహార్ కు వరాల జల్లు..

  • 01 Feb 2025 12:02 PM (IST)

    నష్టాల్లో స్టాక్‌ మార్కెట్..

    బడ్జెట్‌కి ముందు లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. 400 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్‌.. 135 పాయింట్లు డౌన్‌ అయినా నిఫ్టీ..

  • 01 Feb 2025 12:01 PM (IST)

    ద్రవ్యలోటు 4.8 శాతం..

    2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యయం రూ.47.16లక్షల కోట్లు.. మూలధన వ్యయం రూ.10.1 లక్షల కోట్లు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన ఆదాయ అంచనా రూ.31.47 లక్షల కోట్లు.. నికర పన్నుల ద్వారా సమకూరిన ఆదాయం రూ.25.57 లక్షల కోట్లు.. ద్రవ్యలోటు జీడీపీలో 4.8 శాతంగా ఉంటుందని కేంద్రం అంచనా.

  • 01 Feb 2025 12:00 PM (IST)

    పట్టణ పేదల కోసం క్రెడిట్ కార్డులు..

    30 వేల రూపాయల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్‌ క్రెడిట్‌ కార్డులు..

  • 01 Feb 2025 11:59 AM (IST)

    త్వరలోనే జన విశ్వాస్‌ 2.0 బిల్లు..

    త్వరలో పార్లమెంట్ ముందుకు జన విశ్వాస్‌ 2.0 బిల్లు.. వందకు పైగా నిబంధనలను నేరరహితమే లక్ష్యం..

  • 01 Feb 2025 11:57 AM (IST)

    టూరిజంపై ప్రత్యేక శ్రద్ధ..

    ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ టూరిజంపై అదనపు శ్రద్ధ.. మెడికల్‌ టూరిజం ప్రోత్సాహానికి వీసా నిబంధనలు సులభతరం చేయనున్నాం..

  • 01 Feb 2025 11:55 AM (IST)

    స్వయం సహాయక గ్రూపులకు క్రెడిట్ కార్డులు..

    స్వయం సహాయక గ్రూపులకు గ్రామీన్ క్రెడిట్ కార్డులు.. 6 లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ పై పన్నులు తగ్గింపు..

  • 01 Feb 2025 11:53 AM (IST)

    కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు..

    వచ్చే వారం పార్లమెంట్ ముందుకు కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు.. ఇన్‌కమ్ ట్యాక్స్ లో ఉన్న అనవసర సెక్షన్లు తొలగింపు.. బీఎన్ఎస్ స్ఫూర్తితో కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు తీసుకొస్తున్నాం.. లిటిగేషన్లు తగ్గించేలా ఇన్‌కమ్ ట్యాక్స్ విధానం..

  • 01 Feb 2025 11:51 AM (IST)

    వారికి ఈ-శ్రమ్ కార్డులు..

    2025-26లోనే ఆస్పత్రుల్లో 200 క్యాన్సర్ సెంటర్స్.. ఆన్ లైన్ ఫ్లాట్ ఫాం వర్కర్స్ (గిగ్)కు ఐడీ కార్డులు, హెల్త్ కవర్.. వారి కోసం ఈ-శ్రమ్ పోర్టల్..

  • 01 Feb 2025 11:50 AM (IST)

    ఆహార భద్రత కోసం జీన్ బ్యాంక్

    ఐఐటీ, ఐఐఎస్సీ పరిశోధనలు చేసే 10 వేల మందికి ఫెలోషిప్స్.. ఆహార భద్రత కోసం జీన్ బ్యాంక్ ఏర్పాటు..

  • 01 Feb 2025 11:49 AM (IST)

    ఈవీ బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహాకాలు

    ఈవీ బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహాకాల కోసం క్లీన్ టెక్ మిషన్.. మరో 120 రూట్లలో ఉడాన్ పథకం.. పర్యాటక ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు.. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి 22 పర్యాటక ప్రాంతాల అభివృద్ధి.. ఇన్సూరెన్స్ రంగంలో వందశాతం ఎఫ్ డీఐలకు అనుమతి.. వచ్చే వారం పార్లమెంట్ ముందుకు కొత్త ఇన్ కం ట్యాక్స్ బిల్లు..

  • 01 Feb 2025 11:46 AM (IST)

    భారతీయ భాషా పుస్తక్ స్కీమ్

    భారతీయ భాషా పుస్తక్ స్కీమ్, జ్ఞాన్ భారతం మిషన్.. విద్యలో ఏఐ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్..

  • 01 Feb 2025 11:44 AM (IST)

    సోలార్ సెల్స్, ఈవీ బ్యాటరీలకు ఊతం..

    సోలార్ సెల్స్, ఈవీ బ్యాటరీలు, విండ్ టర్బయిన్స్ కు ఊతం.. పెట్టుబడులు మా థర్డ్ ఇంజిన్..

  • 01 Feb 2025 11:42 AM (IST)

    విద్యుత్ రంగంలో సంస్కరణలకు పెద్దపీట..

    విద్యుత్ రంగంలో సంస్కరణలకు పెద్దపీట.. విద్యుత్ సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు ప్పోత్సాహకాలు.. సంస్కరణలు అమలు చేస్తే జీఎస్డీపీలో 0.5 శాతం అదనపు రుణాలు.. క్లీన్ ఎనర్జీ దిశగా అణుశక్తి మిషన్.. 2047 నాటికి 100 GWల అణు విద్యుత్ ఉత్పాదనే లక్ష్యం..

  • 01 Feb 2025 11:39 AM (IST)

    పర్వత ప్రాంతాల్లో హెలిప్యాడ్స్ ఏర్పాటు..

    పర్వత ప్రాంతాల్లో హెలిప్యాడ్స్ ఏర్పాటుకు చర్యలు.. బిహార్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్.. రూ. లక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్.. నగరాలను గ్రోత్ హబ్స్ గా మార్చేందుకు నిధులు..

  • 01 Feb 2025 11:38 AM (IST)

    ఆ రాష్ట్రాలకు రూ. 1.5 లక్షల కోట్లు..

    సంస్కరణలు అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు.. 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు.. మూలధన వ్యయాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 1.5 లక్షల కోట్ల రుణాలు.. 2028 వరకు జల్ జీవన్ మిషన్ పొడిగింపు..

  • 01 Feb 2025 11:36 AM (IST)

    ఫుట్ వేర్, లెదర్ రంగాల్లో కొత్తగా 22 లక్షల జాబ్స్ తెస్తాం..

    దేశంలో కోటికి పైగా నమోదిత ఎంఎస్ఎంఈలు.. 45 శాతం ఎగుమతులు ఎంఎస్ఎంఈలవే.. ఎంఎస్ఎంఈల పెట్టుబడి, టర్నోవర్లు 2- 2.5 రెట్లు పెంపు.. ఫుట్ వేర్, లెదర్ రంగాల్లో కొత్తగా 22 లక్షల జాబ్స్ తెస్తాం..

  • 01 Feb 2025 11:33 AM (IST)

    చేపల ఉత్పత్తుల్లో రెండో స్థానంలో ఇండియా..

    చేపల ఉత్పత్తుల్లో ఇండియా ప్రపంచంలోనే నెంబర్ 2.. రైతులు, మత్య్సకారులు, డెయిరీ వారికి కిసాన్ క్రెడిట్ కార్డులు.. అసోంలో 12.7 లక్షల టన్నుల యూరియా ప్లాంట్.. ఇక గ్రామీణ ఎకానమీలో లక్షన్నర గ్రామీణ పోస్టాఫీసుల పాత్ర..

  • 01 Feb 2025 11:32 AM (IST)

    స్టార్టప్ లకు ఇచ్చే రుణాలు పెంపు..

    ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలు రూ. 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంపు.. స్టార్టప్ లకు ఇచ్చే రుణాలు రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు పెంపు.. రూ. 30 వేలతో స్ట్రీట్ వెండర్స్ కు క్రిడిట్ కార్డులు.. బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం..

  • 01 Feb 2025 11:28 AM (IST)

    అన్ని ప్రభుత్వ స్కూల్స్ కు బ్రాడ్ బ్యాండ్ సేవలు..

    అంగన్ వాడీ కేంద్రాలకు కొత్త హంగులు.. అన్ని ప్రభుత్వ స్కూల్స్ కు బ్రాడ్ బ్యాండ్ సేవలు.. పదేళ్లలో ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య రెట్టింపు.. ఐఐటీ పాట్నా విస్తరణకు నిర్ణయం.. విద్యా రంగంలో ఏఐ వినియోగం.. ఐదేళ్లలో అదనంగా 75 వేల మెడికల్ సీట్లు.. బిహార్ లో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ..

  • 01 Feb 2025 11:26 AM (IST)

    10 రంగాలపై ప్రత్యేక దృష్టి..

    10 రంగాలపై ప్రత్యేక దృష్టి.. పేదలు, యూత్, అన్నదాతలు, మహిళలు, ప్రపంచ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా భారత్.. ఎగుమతులు పెంచుతాం.. ఇన్నోవేషన్స్ కు పెద్దపీట..

  • 01 Feb 2025 11:24 AM (IST)

    ఈశాన్య రాష్ట్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ

    ఈశాన్య రాష్ట్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ప్రోత్సాహం.. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ బోర్డు ఏర్పాటు..

  • 01 Feb 2025 11:24 AM (IST)

    పోస్టల్ శాఖకు కొత్త రూపు

    లాజిస్టిక్ వ్యవస్థగా ఇండియన్ పోస్ట్.. పోస్టల్ శాఖకు కొత్త రూపు ఇచ్చేలా ప్రణాళిక..

  • 01 Feb 2025 11:22 AM (IST)

    ఎస్పీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేక పథకం..

    ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం ప్రత్యేక పథకం..

  • 01 Feb 2025 11:21 AM (IST)

    ఎంఎస్ఎంఈలకు రుణ సదుపాయాలు పెంపు..

    ఎగుమతులు చేసే ఎంఎస్ఎంఈలకు రూ. 20 కోట్ల వరకు రుణాలు.. ఎంఎస్ఎంఈలకు రుణ సదుపాయాలు పెంపు.. ఎంఎస్ఎంఈ రంగంలో 7.8 కోట్ల మంది కార్మికులు..

  • 01 Feb 2025 11:20 AM (IST)

    కేసీసీ ద్వారా రైతులకు ప్రయోజనం..

    కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 7.74 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందారు.. కేసీసీ ద్వారా లోన్లు రూ. 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంపు.. బిహార్ లో మఖనా రైతుల కోసం ప్రత్యేక బోర్డు.. మఖనా ఉత్పత్రి పెంచేలా బోర్డు ద్వారా శిక్షణ..

  • 01 Feb 2025 11:17 AM (IST)

    2025-26 వృద్ధి రేటు 6.8 అంచనా..

    2024-25లో ఎకానమీ వృద్ధి అంచనా 6.4 శాతం.. 2025-26కు అంచనా 6.3- 6.8 శాతం.. సబ్ కా వికాస్ కు వచ్చే ఐదేళ్లు సువర్ణవకాశం.. గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ ను ప్రపంచ పరిణామాలు దెబ్బ తీస్తున్నాయి.. వికాస్ భారత్ లో జీరో పేదరికం, వంద శాతం క్వాలిటీ విద్య: ఆర్థిక మంత్రి నిర్మలా

  • 01 Feb 2025 11:15 AM (IST)

    పప్పు ధాన్యాల కోసం ప్రణాళిక..

    పప్పు ధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళిక.. ప్రయోగాత్మకంగా 100 జిల్లాలో పీఎం ధన్ ధాన్య యోజన..

  • 01 Feb 2025 11:13 AM (IST)

    ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో బడ్జెట్..

    ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో బడ్జెట్.. ఇన్ ఫ్రా, మధ్య తరగతి ప్రజల వికాసమే లక్ష్యంగా ప్రణాళిక..

  • 01 Feb 2025 11:12 AM (IST)

    పార్లమెంట్ నుంచి విపక్ష ఎంపీల వాకౌట్..

    బడ్జెట్ ప్రసంగాన్ని వాకౌట్ చేసిన విపక్ష ఎంపీలు..

  • 01 Feb 2025 11:12 AM (IST)

    6 రంగాల్లో సమూల మార్పులు..

    6 రంగాల్లో సమూల మార్పులు.. 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం..

  • 01 Feb 2025 11:11 AM (IST)

    సున్నా శాతం పేదరికమే లక్ష్యంగా బడ్జెట్

    అధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి.. సున్నా శాతం పేదరికమే లక్ష్యంగా బడ్జెట్

  • 01 Feb 2025 11:10 AM (IST)

    వికసిత్ భారత్ మా లక్ష్యం..

    వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.. మేము చేపట్టిన సంస్కరణలు.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి..

  • 01 Feb 2025 11:09 AM (IST)

    విపక్షాల ఆందోళన మధ్యే బడ్జెట్ నిర్మలా ప్రసంగం..

    విపక్షాల ఆందోళన మధ్యే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం..

  • 01 Feb 2025 11:07 AM (IST)

    గురజాడ సూక్తితో బడ్జెట్ ప్రసంగం ప్రారంభం..

    బడ్జెట్ ప్రసంగంలో దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ గురజాడ అప్పారావు సూక్తితో ప్రసంగం ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..

  • 01 Feb 2025 11:03 AM (IST)

    లోక్ సభలో ప్రతిపక్షాల ఆందోళన

    లోక్ సభలో ప్రతిపక్షాల ఆందోళన.. నిర్మలా సీతారామన్ ప్రసంగానికి అడ్డుతగులుతున్న విపక్ష సభ్యులు..

  • 01 Feb 2025 11:01 AM (IST)

    బడ్జెట్ ప్రవేశ పెడుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి..

    లోక్ సభలో వార్షిక బడ్జెట్‌ 2025-26ను ప్రవేశ పెడుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..

  • 01 Feb 2025 10:48 AM (IST)

    కాసేపట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి..

    కాసేపట్లో లోక్ సభలో వార్షిక బడ్జెట్ 2025-26ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ్ పెట్టనున్నారు.

  • 01 Feb 2025 10:40 AM (IST)

  • 01 Feb 2025 10:32 AM (IST)

    బడ్జెట్ కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్..

    వార్షిక బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.. కాసేపట్లో పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..

  • 01 Feb 2025 10:28 AM (IST)

    కేంద్ర కేబినెట్ ప్రారంభం..

    కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం.. వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేబినెట్..

  • 01 Feb 2025 10:22 AM (IST)

    బడ్జెట్‌పై పెద్దగా అంచనాలు లేవు: రాబర్ట్ వాద్రా

    నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తదితర సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారు.. కుంభమేళా జరుగుతున్న నేపథ్యంలో రైల్వే, విమాన ఛార్జీలు పెంపు.. ప్రజల ఆసక్తి మేరకు కేంద్ర బడ్జెట్‌ ఉండాలి- రాబర్ట్ వాద్రా

  • 01 Feb 2025 10:12 AM (IST)

    కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ..

    కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం.. ఉదయం 10.20కి భేటీకానున్న కేంద్ర కేబినెట్.. బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేంద్ర మంత్రివర్గం.. ఉదయం 11గంటలకి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..

  • 01 Feb 2025 10:07 AM (IST)

    నేటి సాయంత్రం ఆర్థిక, ప్రణాళిక శాఖల ఉన్నాధికారులతో సీఎం భేటీ..

    ఈరోజు సాయంత్రం 4గంటలకు ఆర్థిక శాఖ, ప్రణాళిక విభాగం ఉన్నతాధికారులతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ..