Site icon NTV Telugu

రేపు కేంద్ర కేబినెట్‌ భేటీ

Union Cabinet

Union Cabinet

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన రేపు కేంద్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది… ఆదివారం రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోడీ.. తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.. ఆ సమావేశం జరిగిన రెండు రోజుల తర్వాత కేబినెట్‌ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.. ఈ సమావేశంలో కోవిడ్ -19 మహమ్మారికి సంబంధించిన సమస్యలతో పాటు ఇతర ముఖ్య విషయాలపై చర్చించే అవకాశం ఉంది.. మరోవైపు.. కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఉంటాయంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలోనూ ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.. ఇక, బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా.. బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలు ఏకం అవుతూ.. ఇవాళ హస్తినలో సమావేశం అయిన విషయం తెలిసిందే కాగా.. థర్డ్ ఫ్రంట్‌ ప్రయత్నాలపై కూడా చర్చ జరిగే అవకాశం లేకపోలేదు అంటున్నారు.

Exit mobile version